Home> ఆధ్యాత్మికం
Advertisement

Ayodhya Rammandir Schedule: అయోధ్యలో మొదలైన ముందస్తు క్రతువులు, ఏ రోజు ఏం జరుగుతుందంటే

Ayodhya Rammandir Schedule: మరి కొద్దిరోజుల్లో అయోధ్య రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇవాళ్టి నుంచి అయోధ్యలో ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. జనవరి 22 వరకూ ఎప్పుడు ఏం జరుగుతుందనే షెడ్యూల్ ఇలా ఉండనుంది.

Ayodhya Rammandir Schedule: అయోధ్యలో మొదలైన ముందస్తు క్రతువులు, ఏ రోజు ఏం జరుగుతుందంటే

Ayodhya Rammandir Schedule: జనవరి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందూవులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు అయోధ్య రామాలయంలో ముందస్తు ఆచారాలు మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీ మద్యాహ్నం నూతన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్నించి ప్రముఖులు తరలిరానున్నారు. భారీగా భక్తజనం అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి రోజుకొక ఆచారం, సాంప్రదాయం చోటుచేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్ని భక్తులు అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటారని అంచనా. జనవరి 21, 22 తేదీల్లో సాధారణ ప్రజలకు ఆలయంలో ప్రవేశం ఉండదు. 

జనవరి 16 న సరయు నది తీరాన విష్షు ప్రార్ధన, దశవిధ స్నానం, గోదానం కార్యక్రమాలు

జనవరి 17న రామ్ లల్లా విగ్రహాల ఊరేగింపు, సరయూ నది నీటితో కూడిన మంగళ కలశాలు చేరిక

జనవరి 18న గణపతి అంబికా పూజ, వరుణ పూజ, మాత్రిక పూజ, బ్రాహ్మిన్ వరణ్, వాస్తు పూజలు

జనవరి 19న అగ్నిదేవునికి ప్రత్యేక పూజాది కార్యక్రమాల నిర్వహణ, నవ గ్రహాల ప్రతిష్ఠ

జనవరి 20న రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నది నీటితో శుభ్రం చేయడం, వాస్తు శాంతి నిర్వహణ, అన్నదానం

జనవరి 21న 125 పవిత్ర కలశాలతో రాముడి విగ్రహ స్నానం

జనవరి 22 మద్యాహ్నం 12.30 గంటల్నించి 1 గంట మధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ

Also read: Salaar OTT: ఓటీటీలో వచ్చేస్తున్న సలార్ సినిమా, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More