Home> ఆధ్యాత్మికం
Advertisement

Astrology: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి తీవ్ర నష్టాలు తప్పవు!


Shani, Mangal and Chandrama In Aquarius In Telugu: కుంభ రాశిలో చంద్రుడు, కుజుడు, శని గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశలువారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. 

Astrology: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి తీవ్ర నష్టాలు తప్పవు!

Shani, Mangal and Chandrama In Aquarius In Telugu:  గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైన ఒక గ్రహం రాశి సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయడం కారణంగా అప్పుడప్పుడు ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో ప్రత్యేక సంచార క్రమంలో ఉన్నాడు. అలాగే చంద్ర గ్రహం కూడా శని రాశి కుంభంలోనే ఉంది. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 7:39 గంటల సమయంలో కుంభ రాశిలో చంద్రుడు, కుజుడు, శని మూడు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవు!:
మేష రాశి:

మేష రాశి వారికి చంద్రుడు, కుజుడు, శని మూడు గ్రహాల కలయిక కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చి, తీవ్ర ఇబ్బందులు పడతారు. దీంతో పాటు మానసిక ప్రశాంతత కూడా సులభంగా తగ్గుతుంది. అలాగే సహనం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు వాహనాలు నడిపే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే గాయాలు సంభవించే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. దీంతో పాటు ప్రేమ జీవితంలో కూడా అనేక రకాల ఇబ్బందులు రావచ్చు. దీంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మేలు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వీరకి ప్రేమ జీవితంలో అనేక రకాల సమస్యలు రావచ్చు. దీంతో పాటు ఆర్థికంగా నష్టాలు కూడా సంభవిస్తాయి. అంతేకాకుండా పనుల్లో అడ్డంకులు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు మనస్సు కూడా కలత చెందే ఛాన్స్‌ ఉంది. 

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కూడా ఈ మూడు గ్రహాలు కుంభ రాశిలో సంచారం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా వీరికి పనుల్లో ఏకాగ్రత తగ్గి అనేక సమస్యలు రావచ్చు. దీంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినొచ్చు. వ్యాపారాలు చేసేవారికి తీవ్ర ఆర్థిక సమస్యలు వస్తాయి. దీంతో పాటు కోపం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More