Home> ఆధ్యాత్మికం
Advertisement

Astro Tips: గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ఈ కిచెన్ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు

Astro Tips: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలకు చాలా మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. ఈ గ్రహాల గోచారం మనిషి జీవితంలో చాలా ప్రభావం చూపిస్తుంది. ఎవరి జాతకం కుండలిలోనైనా గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ఆ వ్యక్తికి అన్నివిధాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ఈ గ్రహాల్ని పటిష్టం చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయి.

Astro Tips: గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ఈ కిచెన్ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు

ఏదైనా గ్రహం ఎవరి జాతకం కుండలిలోనైనా అశుభ స్థితిలో ఉంటే..ఆ వ్యక్తిని నలువైపుల్నించి సమస్యలు చుట్టుముడతాయి. ప్రత్యేకించి  ఆ గ్రహం గోచారం లేదా పరివర్తనం చెందుతుంటే..వివిధ రకాల ఇబ్బందులు ఎదురౌతాయి. ఆ వివరాలు మీ కోసం..

ఎవరి జాతకం కుండలిలోనైనా గ్రహాలు అశుభ స్థితిలో ఉంటే..ముందుగా ఆ ప్రభావాన్ని తగ్గించాల్సి ఉంటుంది. దీనికోసం జ్యోతిష్యశాస్త్రంలో చాలా రకాల ఉపాయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మీ కిచెన్‌లో వస్తువులు. కిచెన్‌లోని కొన్ని రకాల వస్తువుల్ని దానం చేయడం వల్ల వేర్వేరు గ్రహాల దోషాన్ని తొలగించవచ్చు. శని దోషం దూరం చేసేందుకు ఆవాల నూనె, కలౌంజీ లేదా నల్ల నువ్వులు దానం చేయాల్సి ఉంది. దీనివల్ల శని ఆగ్రహం నుంచి విముక్తి కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు దూరమౌతాయి. అటు దేవగురువు గురుడిని పటిష్టం చేసేందుకు కిచెన్‌లో వినియోగించే పసుపు, కేసరి, అరటి ఇతర పసుపు వస్తువుల్ని దానం చేయాలి. దీనివల్ల పెళ్లిలో ఇబ్బందులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరమౌతాయి.

సూర్య దోషం

ఏదైనా జాతకం కుండలిలో ఒకవేళ సూర్యుడు బలహీన స్థితిలో ఉంటే..కిచెన్ లో లభ్యమయ్యే నెయ్యి, కేసరి, గోధుమలు లేదా వీటితో చేసిన ఏదైనా వస్తువుల్ని దానం చేయాల్సి ఉంటుంది. సూర్యుడు పటిష్టమైతే..మనిషిని ప్రతిరంగంలో వృద్ధి కలుగుతుంది. మనిషి కుండలిలో చంద్రుడు బలహీనంగా ఉంటే..జలం, పాలు, బియ్యం దానం చేయాలి. దీంతోపాటు చంద్రుడిని పటిష్టం చేసేందుకు తులసి మొక్కకు జలాభిషేకం చేయాలి. మనిషి మానసికంగా పటిష్టంగా ఉండాలి.

మంగళ గ్రహం

కుండలిలో మంగళ గ్రహాన్ని పటిష్టం చేసేందుకు ఎర్ర రంగు పళ్లు, కూరగాయలు దానం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు హనుమంతుడికి పిండితో చేసిన మిఠాయి రొట్టెలు అర్పించాలి. మంగళ గ్రహం స్థితి పటిష్టంగా ఉంటే..ఇంటి సమస్యల్నించి విముక్తి లభిస్తుంది. 

Also read: Slippers Vastu Tips: చెప్పులు తిరగేసి ఉంచితే ఏమౌతుంది, చెప్పులు దొంగతనం దేనికి సంకేతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More