Home> ఆధ్యాత్మికం
Advertisement

Astro Tips: ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ పద్ధతులు పాటించాల్సిందే

Astro Tips: హిందూమతం ప్రకారం కొన్ని పద్దతులు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాలు. కొంతమంది వీటిని మూఢ నమ్మకాలని చెప్పినా..జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. 
 

Astro Tips: ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ పద్ధతులు పాటించాల్సిందే

హిందూమతంలో లక్ష్మీదేవి అంటే ధనానికి ప్రతిరూపం. ధనదేవతగా భావిస్తారు. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలంటారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..

ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో..అతని జీవితంలో ప్రతి సుఖం, ప్రతి సౌకర్యం కలుగుతుంది. ఎవరికైతే లక్ష్మీదేవి ఆశీస్సులుంటాయో ఆ వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక గ్రంధాలు, జ్యోతిష్యంలో కూడా లక్ష్మీదేవి మహిమ, దేవిని ప్రసన్నం చేసుకునే చాలా మార్గాల గురించి ప్రస్తావన ఉంది. కానీ ఏ విధమైన మార్గాలు ఆచరించకుండానే..కొన్ని విషయాల్ని గుర్తుంచుకుంటే..ఎప్పటికీ లక్ష్మీదేవి కటాక్షం సాధించవచ్చు.

జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని చెడు అలవాట్ల గురించి ప్రస్తావన ఉంది. ఆ అలవాట్లతో ఆ మనిషి నాశనమైపోతాడు. అంతేకాదు సకాలంలో ఈ చెడు అలవాట్లను మానకపోతే..ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. ఆ చెడు అలవాట్లేంటో తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోవడమంటే..ఆ ఇంట్లో దారిద్య్రం తిష్టవేయడమే. అన్నం లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది. చాలామంది ప్లేట్లలో ఎంగిలి భోజనం వదిలేస్తుంటారు. అన్నం వృధా చేయడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టముండదు. అన్నాన్ని పాడు చేస్తే..ఇంట్లో, కుటుంబంలో దరిద్రం వెంటాడుతుంది. ఈ జాగ్రత్తలు సదా పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ ఇంట్లోనే ఉంటుంది. సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి.

ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవడం ఉత్తమమని ఉంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం శుభప్రదమని అంటారు. ఏ వ్యక్తి అయితే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేస్తాడో..అతనిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. లేకపోతే ఉండదు. అటు సాయంత్రం వేళ నిద్రపోవడం కూడా అశుభం. సాయంత్రం నిద్రపోతే..ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి.

లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేముందు ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ వ్యక్తి ఇంట్లో శుభ్రత ఉండదో ఆ ఇంట్లోంచి లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుంది. నిర్ణీత పద్ధతిలో ఉదయం వేళ శుభ్రం చేయాలి. 

జ్యోతిష్యశాస్త్రం, ధార్మిక గ్రంధాల ప్రకారం..చాలామంది ఉప్పుని చేతుల్లో ఇచ్చేస్తుంటాం. కానీ అలా చేయకూడదు. ఈ అలవాటు వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఉప్పు ఇచ్చేటప్పుడు ప్లేట్‌లో పెట్టి ఇవ్వాలి.

Also read: Chandra Grahan 2022: 2023 అక్టోబర్ వచ్చే గ్రహణం కంటే ఇదే పెద్ద చంద్ర గ్రహణం.. నేరుగా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More