Home> ఆధ్యాత్మికం
Advertisement

Halharini Amavasya 2022: హలహరిణి అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya 2022: హిందూమతంలో పూర్ణిమ మరియు అమావాస్య తిథి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇందులో ఆషాఢ అమావాస్యకు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని 'హలహరిణి అమావాస్య' అని కూడా అంటారు.
 

Halharini Amavasya 2022: హలహరిణి అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya 2022 Significance: ఆషాఢ అమావాస్యను 'హలహరిణి అమావాస్య' అని కూడా అంటారు. ఈ రోజున రైతులు తమ వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు, అలాగే పంటల నాట్లు వేస్తారు. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య జూన్ 28 లేక జూన్ 29 అనే విషయంలో సందేహం నెలకొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం అమావాస్య అంటే హల్హరిణి అమావాస్య (Halharini Amavasya 2022) జూన్ 28, మంగళవారం నాడు వస్తుంది, అయితే స్నానం మరియు దానం యొక్క అమావాస్య జూన్ 29, బుధవారం ఉంటుంది. ఆషాఢ అమావాస్య ముహూర్తం 28 జూన్ 2022 ఉదయం 05:52 నుండి 29 జూన్ 2022 ఉదయం 08:21 వరకు ఉంటుంది. 

హలహరి అమావాస్య రోజున ఈ పని చేయండి
>> ఆషాఢ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇది సాధ్యం కాకపోతే, స్నానపు నీటిలో పవిత్ర నదీ జలాలను కలుపుకుని స్నానం చేయండి.
>>  స్నానం చేసిన తర్వాత సూర్యునికి నీటిని సమర్పించండి. ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా ఫలప్రదం.
>>  హలహరి అమావాస్య రోజు నుండి చాతుర్మాస్ ప్రారంభమవుతుంది, కాబట్టి ఈ అమావాస్య నాడు తర్పణం, శ్రాద్ధం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు ముక్తిని పొందుతారు.
>>  అమావాస్య రోజు దానం చేయాలి. దీని వల్ల పూర్వీకులు కూడా సంతోషంగా ఉంటారు మరియు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా వస్తుంది.
>>  డబ్బులేమితో ఇబ్బంది పడే వారు ఆషాఢ అమావాస్య రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పిండి ముద్దలు చేసి చేపలకు తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీలైతే, ప్రతి అమావాస్యనాడు ఈ పరిహారం చేయండి.

Also Read: Mars Transit Effect: మేషరాశిలో కుజుడు సంచారం... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More