Home> ఆధ్యాత్మికం
Advertisement

Chanakya Niti: లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పద్దతులు పాటించండి!!

CHANAKYA NITI: లక్ష్మీ దేవి దయ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు. తన చాణక్య నీతిలో లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ఆచార్య కొన్ని మార్గాలను సూచించారు. 
 

Chanakya Niti: లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పద్దతులు పాటించండి!!

CHANAKYA NITI:  ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. కానీ లక్ష్మీదేవి (Goddess Lakshmi) కొంతమంది వ్యక్తుల వద్ద మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మరియు సవాళ్ల నుండి సులభంగా బయటపడతారు. ఈ వ్యక్తులు ఇళ్లలో కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించడం వల్ల ఇది సాధ్యమవుతుంది అంటారు ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya). లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ఆచార్య కొన్ని మార్గాలను సూచించారు. 

ఈ ఇళ్లలో లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది..

*ఇంట్లో శుభ్రత పాటించే వారి ఇంట్లో లక్ష్మిదేవి (Goddess Lakshmi) ఉంటుంది. ఆహారం వృథా చేయకుండా ఉంటే..ఆ ఇంట్లో లక్ష్మిదేవి తప్పక కొలువుదీరుతుంది. అలాంటి ఇళ్లలో ఆహారానికి, డబ్బుకు కొదవ ఉండదు. శుభ్రత, శాంతి లేని కుటుంబంలో లక్ష్మిదేవి అడుగుపెట్టదు. 

Also Read: Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..

*కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఉన్న ఇంట్లో, భార్యాభర్తలు ప్రేమతో జీవిస్తారు. తల్లి లక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధనం కలుగుతాయి.

*జ్ఞానులు, సాధువులు, మహాత్ములు ఇళ్లలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. వారు చేసిన పనుల కారణంగా కీర్తిని, సంపదను పొందుతారు. 

* చెడు మాటలు మాట్లాడేవారి ఇంట లక్ష్మీదేవి నిలువదు.  మీరు వ్యాపారవేత్త అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి మాటలు మాట్లాడటానికి రావాలి. లేకపోతే మీరు డబ్బును సద్వినియోగం చేసుకోలేరు. 

* దానధర్మాలు చేసే వ్యక్తిపై తల్లి లక్ష్మికి ప్రత్యేక దయ ఉంటుంది. అతను ఏది దానం చేస్తే తిరిగి అదే పొందుతాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More