Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 రాజయోగాల కలయిక...ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

Shani Jayanti 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. మరో మూడు రోజుల్లో శని జయంతి రాబోతుంది. అంతేకాకుండా అదే రోజు మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. శని జయంతి ఏయే రాశులవారికి మంచి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. 
 

Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 రాజయోగాల కలయిక...ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

Shani Jayanti 2023 date: జ్యేష్ఠ అమావాస్య రోజున శనిదేవుడు జన్మించాడు. అందుకే ఈ రోజున శని జయంతి జరుపుకుంటారు. ఈసారి శని జయంతి మే 19, శుక్రవారం నాడు వస్తోంది. శని అనుగ్రహం పొందడానికి ఇది చాలా మంచి రోజు. ఈసారి శని జయంతి రోజున శోభనయోగం, శష్ యోగం, గజకేసరి యోగం వంటి మూడు అరుదైన రాజయోగాలు కలయిక ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభం: ఈరాశికి అధిపతి శనిదేవుడు. ప్రస్తుతం ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. అందుకే శని జయంతి రోజున వీరు శుభఫలితాలను పొందనున్నారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో ఊహించని పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. బిజినెస్ విస్తరిస్తుంది. 
మిథునం: శని జయంతి మిథునరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. 
సింహ రాశి: సింహరాశివారికి శని జయంతి కలిసి వస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీ కల నెరవేరుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. 

Also Read: Sun transit 2023: సూర్య సంచారంతో ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More