Home> ఆధ్యాత్మికం
Advertisement

Five Rajyog: ఒకే రోజు పంచగ్రహ కూటమితోపాటు 5 రాజయోగాలు... నేటి నుంచి ఈ 3 రాశులకు తిరుగులేనంత ధనం..

Shani-Guru: ఉగాది నాడు 5 రాజయోగాలతోపాటు ఒకే రాశిలో 5 గ్రహాల కలయిక ఏర్పడింది. దీంతో మూడు రాశులవారికి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Five Rajyog: ఒకే రోజు పంచగ్రహ కూటమితోపాటు 5 రాజయోగాలు... నేటి నుంచి ఈ 3 రాశులకు తిరుగులేనంత ధనం..

Five Rajyog in Horoscope 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్చి 22 నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా నిన్నటి నుండే తెలుగు సంవత్సరాది అయిన ఉగాది కూడా మెుదలైంది. ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవి యెుక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఈ నవరాత్రుల్లోనే శష్, హన్స్, నీచభంగ్, బుధాదిత్య మరియు గజకేసరి అనే 5 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా నిన్న మీనరాశిలో 5 గ్రహాల కలయిక ఏర్పడింది. హిందూ న్యూ ఇయర్ ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

ధనుస్సు రాశి
హిందువుల నూతన సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. దంపతులకు సంతానప్రాప్రి కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మకర రాశి
విక్రమ్ సంవత్ 2020మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఫ్యామిలీ మీకు అండగా నిలబడుతుంది. మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహం  కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
మిథున రాశి
ఉగాది నుండి మిథునరాశి వారి అదృష్టం మారనుంది. మీరు ప్రతి పని లేదా వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీకు అనుకోకుండా డబ్బు అందుతుంది. ఉద్యోగులు పదోన్నతి లభిస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం  ఉంది. 

Also Read: Solar Eclipse 2023: తొలి సూర్యగ్రహణం నాడు ఈ రాశుల దశ తిరగబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More