Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani budh yuti 2023: మూడు దశాబ్దాల తర్వాత గొప్ప కలయిక.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..

Saturn Mercury Transit 2023: ఆస్ట్రాలజీలో శనిని న్యాయదేవుడు అని మరియు బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మరో రెండు రోజుల్లో ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి బంపర్ ప్రయోజనాలను ఇస్తుంది. 
 

Shani budh yuti 2023: మూడు దశాబ్దాల తర్వాత గొప్ప కలయిక.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..

Saturn Mercury Transit 2023: గ్రహాలు పర్టికలర్ టైం తర్వాత తమ రాశులను మారుస్తాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఫిబ్రవరి 27న గ్రహాల రాకుమారుడు బుధుడు తన రాశిని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 30 ఏళ్ల తర్వాత తన సొంతరాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. పైగా శాటరన్ మరియు మెర్క్యూరీ మిత్రులు. కుంభరాశిలో బుధుడు-శని యొక్క మహా సంయోగ ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ముఖ్యంగా నాలుగు రాశులవారు లాభపడనున్నారు.ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శని-బుధ కలయిక ఈ రాశులకు వరం
మేషరాశి: బుధ-శని కలయిక మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీరి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం-వ్యాపారంలో అదృష్టం మీ వెంట ఉంటుంది. బిజినెస్ చేసేవారు డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. 
వృషభం: శని, బుధుల కలయిక వల్ల వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగార్థులకు పదోన్నతులు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా డబ్బు వస్తుంది. కొత్త పనులు మెుదలు పెట్టడానికి ఇదే తగిన సమయం. 
మిథునం: బుధ, శని సంయోగం మిథునరాశి వారికి అదృష్టం కలిగిస్తుంది. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
కర్కాటకం: బుధుడు రాశి మార్పు వల్ల ఏర్పడిన బుధుడు-శని కలయిక కర్కాటక రాశి వారికి విద్యారంగంలో పెద్ద లాభాలను ఇస్తుంది.  మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. టూర్ కు వెళ్లతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది.

Also Read: Navpancham Rajyog: గురు-చంద్రుడు 'నవపంచం యోగం'... ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More