Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Grahan 2023: వైశాఖ అమావాస్య నాడే తొలి సూర్యగ్రహణం, ఈ నిజాలు తెలుసుకోండి..

Surya Grahan 2023:  మరో మూడు రోజుల్లో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి. 
 

Surya Grahan 2023:  వైశాఖ అమావాస్య నాడే తొలి సూర్యగ్రహణం, ఈ నిజాలు తెలుసుకోండి..

Surya Grahan 2023 date:  హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ అమావాస్య ఏప్రిల్ 20న ఏర్పడనుంది. ఇదే రోజు తొలి సూర్యగ్రహణం కూడా సంభవించబోతుంది. సూర్యగ్రహణంలో మూడు రకాలు ఉన్నాయి. అవే సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం మరియు వార్షిక సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో రాహువు మరియు కేతువు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. గ్రహణ సమయంలో కొన్ని పనులు, శుభకార్యాలు నిషేదించబడ్డాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

సుతక్ సమయం
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, గ్రహణానికి ముందు కాలాన్ని సూతకం అంటారు. సూర్యగ్రహణం యొక్క సూతక కాలం ఎక్కువ మరియు చంద్రగ్రహణం యొక్క సూతక కాలం తక్కువగా ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో సూతకం నాలుగు గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. గ్రహణం కనిపించకపోవడంతో సూతకం కూడా ఉండదు. 

Also Read: First Solar Eclipse 2023: గ్రహణం కారణంగా సూర్య-రాహు దోషం, ఇలా చేశారో జీవితాంతం ఇబ్బందులే!

సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఏప్రిల్ 20న సూర్యగ్రహణం నార్త్ వెస్ట్ కేప్, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్ యొక్క తూర్పు భాగాలు మరియు తారు ద్వీపం నుండి కనిపిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు. శాస్త్రవేత్తల ప్రకారం, ఇది హైబ్రిడ్ గ్రహణం. దీనిని హైబ్రిడ్ ఎక్లిప్స్ అంటారు.

Also Read: Astrology: ఏప్రిల్ 23న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More