Home> సోషల్
Advertisement

Divorce Celebrations: ఇక్కడ విడాకులు కూడా పెళ్లి వేడుకే.. డైవర్స్ సెలబ్రేషన్స్ తప్పనిసరి

Divorce Celebrations: పెళ్లి అంటే ఎవరి జీవితానికైనా లైఫ్ టైమ్ ఈవెంట్ అనిపించేంత గొప్ప వేడుకే కదా మరి. అదే సమయంలో దురదృష్టవశాత్తుగా పెళ్లి తరువాత వారి జీవితాలు విడాకుల దిశగా ప్రయాణిస్తే.. అంతకంటే బాధాకరం మరొకటి ఉండదు కదా. కానీ ఆ విడాకులను కూడా పెళ్లి తరహాలోనే గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకునే చోటు ఒకటుంది తెలుసా ? ఆ డీటేల్స్ ఇదిగో.. 

Divorce Celebrations: ఇక్కడ విడాకులు కూడా పెళ్లి వేడుకే.. డైవర్స్ సెలబ్రేషన్స్ తప్పనిసరి

Divorce Celebrations: పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు.. ఇది ఒక తెలుగు సినిమా కోసం ప్రముఖ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ రాసిన పాట. పెళ్లి అంటే ఒక నూరేళ్ల జీవితానికి సరిపడేంత గొప్ప వేడుక అనే అర్థంలోంచి రాసుకొచ్చిన పాట ఇది. పెళ్లి అంటే ఎవరి జీవితానికైనా అలాంటి వేడుకే కదా మరి. అదే సమయంలో దురదృష్టవశాత్తుగా పెళ్లి తరువాత వారి జీవితాలు విడాకుల దిశగా ప్రయాణిస్తే.. అంతకంటే బాధాకరం మరొకటి ఉండదు కదా. 

కలిసి ఉన్నంత కాలం కలిసుండి.. ఏదైనా కారణాల వల్ల అయిష్టంగా విడిపోవాల్సి వస్తే.. జీవితంలో ఆ విరహం కలిగించేటంత బాధ మరొకటి ఉండదు. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే అని ఒక దేశం నిరూపిస్తోంది. విడాకులు కూడా పెళ్లి తరహాలోనే సంబరం లాంటి వేడుక అని చేసి చూపిస్తున్నారు ఆ దేశస్తులు. ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది, ఎందుకు విడాకులను కూడా పెళ్లి వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం పదండి.

ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పశ్చిమ ఆఫ్రికాలోని ఒక ఇస్లామిక్ దేశంలో విడాకుల సంప్రదాయం గురించి. ఆ ఇస్లామిక్ దేశం పేరు మారిటేనియా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల జాబితాలో 28వ దేశం కాగా ఆఫ్రికాలో 11వ పెద్ద దేశంగా పేరుకెక్కింది. మారిటేనియా ఒక అరబ్ దేశం మాత్రమే కాదు.. ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రాజకీయాలు, మాట్లాడే భాష అన్నీ అరబిక్ చుట్టే తిరుగుతాయి. మారిటేనియాలో విడాకులను కూడా గ్రాండ్ స్టైల్లో పెళ్లి తరహాలోనే సెలబ్రేట్ చేసుకోవడం అక్కడ అనాదిగా వస్తోన్న ఆనవాయితీ. అయితే, ఈ సంప్రదాయం మగాళ్లకి వర్తించదండోయ్.. కేవలం స్త్రీలకు మాత్రమే. 

చాలా వరకు చాలా దేశాల్లో డైవర్స్ తీసుకున్న మహిళలపై సమాజంలో ఒక చిన్న చూపు, వారి పట్ల వెకిలి చేష్టలు, వారిని అగౌరపర్చడం వంటి పరిణామాలే చూస్తుంటాం. కానీ మారిటేనియాలో మాత్రం అలా కాదు. అక్కడ డైవర్స్ తీసుకున్న మహిళలకు అండగా మేమున్నాం అని చెప్పేలా డైవర్స్ ని కూడా పెళ్లి వేడుకలా సెలబ్రేట్ చేస్తారు. ఈ వేడుకతో వారు మరో పెళ్లికి సిద్ధం అనే సంకేతం కూడా ఉందట. 

ఇది కూడా చదవండి : Dangerous Black King Cobra: భయంకరమైన, లావుగా ఉన్న నల్లత్రాచు పామును ఎంత సింపుల్‌గా పట్టేసిండో

అన్నింటికి మించి, ఈ దేశంలో పెళ్లయి విడాకులు తీసుకున్న మహిళలకు మరో పెళ్లి చేసుకునేందుకు మంచి డిమాండ్ ఉందట. ఎందుకంటే అప్పటికే ఒకసారి పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకున్న కారణంగా వారికి వైవాహిక జీవితంపై ఒక అవగాహన, కష్టసుఖాలపై అవగాహన, జీవితం పట్ల మానసిక పరిపక్వత, అనుభవం అన్నీ వస్తాయి కనుక వారు రెండో పెళ్లి తరువాత తమ జీవితాన్ని మరోసారి ఇబ్బందులపాలు కాకుండా, డైవర్స్ వరకు వెళ్లకుండా చూసుకుంటారనేది అక్కడి వారి నమ్మకంగా చెబుతున్నారు. ఏదేమైనా.. అరబిక్ దేశమైనా.. మారిటేనియాలో మంచి మంచి కట్టుబాట్లే ఉన్నాయి కదా అంటున్నారు ఈ డైవర్స్ సెలబ్రేషన్స్ గురించి తెలుసుకున్న వాళ్లు. మరి మీరేమంటారో మా ఈ కథనం కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.

ఇది కూడా చదవండి : King Cobra Drinking Water Video: దాహంతో అల్లాడుతున్న కింగ్ కోబ్రాకు నీళ్లు తాగించిన ఘనుడు.. వీడియో చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు

ఇది కూడా చదవండి : King Cobra with Hood: పడగవిప్పి నిటారుగా నిలబడిన నాగు పాము.. రాజసం చూసి నివ్వెరపోతున్న జనాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More