Home> సోషల్
Advertisement

Husband, wife Jokes: అందమైన యువతిని చూస్తున్న భర్త తన భార్యకు ఎలా చిక్కాడో చూడండి

Husband Caught Looking At other Woman: ఒక వ్యక్తి భార్యను వెంట పెట్టుకుని రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు ఎదురుగా చిట్టిపొట్టి బట్టల్లో ఓ యువతి డాన్స్ చేస్తూ రెస్టారెంట్‌కి వచ్చిన వారిని అలరిస్తోంది.

Husband, wife Jokes: అందమైన యువతిని చూస్తున్న భర్త తన భార్యకు ఎలా చిక్కాడో చూడండి

Husband Caught Looking At other Woman: భార్యాభర్తలు సరదాగా టైమ్ పాస్ చేయడం కోసం అప్పుడప్పుడు బయటికెళ్లడం చూస్తూనే ఉంటాం. అయితే, అలా భార్యతో కలిసి సరదాగా బయటికెళ్లినప్పుడు భర్త ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే భార్య వైపు నుంచి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో రాముడిలా బిల్డప్ ఇచ్చి వీధిలోకొచ్చాకా కృష్ణుడి వేషం వేసే వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒకలా, బయటికొస్తే ఒకలా షేడ్స్ మార్చే వారు ఏదో ఓ రోజు తమకు తెలియకుండానే తమ లైఫ్ పార్ట్ నర్ కి అడ్డంగా బుక్కవుతారు. అలా అడ్డంగా దొరికిపోయిన రోజు ఏం చేసినా ఆమె చూసే కొరకొర చూపుల బారి నుంచి తప్పించుకోలేరు.  

అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేం లేదు ఇప్పుడు మేం మీకు చూపించబోయే ఈ వీడియోలో కూడా ఒక వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. ఒక వ్యక్తి భార్యను వెంట పెట్టుకుని రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు ఎదురుగా చిట్టిపొట్టి బట్టల్లో ఓ యువతి డాన్స్ చేస్తూ రెస్టారెంట్‌కి వచ్చిన వారిని అలరిస్తోంది. భార్యను వెంటపెట్టుకుని వెళ్లిన వ్యక్తి కళ్లు ఆమెపై పడ్డాయి. తన భార్య తన వెనకాలే ఉందన్న విషయం మర్చిపోయి ఆమెకేసే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలోనే ఆ డాన్స్ చేస్తోన్న యువతి కళ్లు కూడా అతడిపై పడ్డాయి. 

ఇదిలావుంటే, ఆ యువతిని షూట్ చేస్తోన్న కెమెరా లెన్స్ కూడా ఆమె చూపునే అనుసరిస్తూ అతడి వైపునకు మళ్లాయి. తీరా చూస్తే అతడి వెనకాలే కూర్చున్న అతడి భార్య ఈ మొత్తం తతంగాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉంది. తాను పక్కన ఉండగానే, తన భర్త మరో యువతి వైపు చూస్తే ఏ మహిళ మాత్రం తట్టుకుంటుంది చెప్పండి. అందుకే అతడిని ఆమె కొరకొర కొరికేసేలా చూస్తూ ఉంది. ఇంటికెళ్లాకా నీకుంటుంది చూడు నా సామి రంగా అన్నట్టుగా ఉంది ఆమె చూపు. అయితే, కెమెరా తన వైపు తిరగడంతోనే తాను చేస్తోన్న తప్పేంటో తెలుసుకున్న ఆమె భర్త.. ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచని పరిస్థితిలో నీళ్లు నములుతూ కనిపించాడు. ఈ దృశ్యం మొత్తం అక్కడి కెమెరాలో రికార్డయింది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: మండు వేసవిలో వర్షాకాలం.. రైతులకు టెన్షన్ టెన్షన్

తెలియకుండానే జరిగే ఇలాంటి తప్పిదాలు ఒక్కోసారి దాంపత్యాన్ని ఇరకాటంలో పడేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే భార్యతో కలిసి బయటికెళ్లినప్పుడు భర్తలు తమ మనసును అదుపులో పెట్టుకోకపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యభర్తల జోక్స్ లైక్ చేసే వారు ఈ వీడియోను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మరింత వైరల్ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More