Home> సోషల్
Advertisement

Viral Video: పెళ్లిలో అందరూ చూస్తుండగానే పబ్లిగ్గా వధూవరుల ముద్దులాట.. వీడియో వైరల్

Bride and Groom kissing each other on mandap: ఒకప్పటి పెళ్లిళ్లకు, ఇప్పటి పెళ్లిళ్లకు ఎంతో తేడా వచ్చేసింది. ఒకప్పుడు పెళ్లి అంటే అది వేద మంత్రాలు, శాస్త్రోత్తంగా పూర్తయ్యే తంతు వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లి మండపంలోనే వధూవరులు ముద్దులు (Liplocks on wedding mandaps) పెట్టుకునేందుకు పోటీపడుతున్నారు.

Viral Video: పెళ్లిలో అందరూ చూస్తుండగానే పబ్లిగ్గా వధూవరుల ముద్దులాట.. వీడియో వైరల్

Bride and Groom kissing each other on mandap: ఒకప్పటి పెళ్లిళ్లకు, ఇప్పటి పెళ్లిళ్లకు ఎంతో తేడా వచ్చేసింది. ఒకప్పుడు పెళ్లి అంటే అది వేద మంత్రాలు, శాస్త్రోత్తంగా పూర్తయ్యే తంతు వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లి మండపంలోనే వధూవరులు ముద్దులు (Liplocks on wedding mandaps) పెట్టుకునేందుకు పోటీపడుతున్నారు. ఫోటోల కోసమో లేక వీడియోల కోసమో.. పంతులు చెప్పాడనో లేక స్నేహితులు పట్టుబట్టారనో.. ఇలా కారణాలు ఏవైనా.. కొన్ని పెళ్లిళ్లలో వధువరులు వేద మంత్రాలు దాటి ముద్దూ ముచ్చట్ల వరకు వెళ్తున్నారు. ఇంకొన్నిసార్లు ఆ ముద్దుమురిపాలు మితిమీరిపోయి పెళ్లికి వచ్చిన అతిధులను ఔరా అని ముక్కున వేలేసుకునే వరకు తీసుకుపోతున్నాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పెళ్లి పూర్తయింది. శాస్త్రోత్తరంగా పండితుడు నిర్వహించే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. పెళ్లికి వచ్చిన అతిథులు ఇక తిరుగుబాట పడుతుండగా అసలు సీన్ మొదలైంది. పెళ్లి మండపంలో ఎవరు అడిగారో తెలీదు కానీ ఒకసారి వధూవరులను ఒకరికొకరు ముద్దు పెట్టుకోవాల్సిందిగా కోరారు. అప్పటివరకు ఆ అవకాశమే కోసం ఎదురుచూస్తున్నట్టున్నాడు కాబోలు.. వాళ్లు అడిగిందే తడవుగా వెంటనే నవ వధువు ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆత్రంగా ముద్దులు పెట్టడం (Groom started kissing bride) ప్రారంభించాడు. ఒక ముద్దు పెట్టి వదిలేస్తాడులే అని అక్కడున్న వాళ్లు అనుకుంటే.. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ ఆమెను మరింత బిగ్గరగా పట్టుకుని ఘాటైన ముద్దులిచ్చాడు. 

Also read : Bicycle tax notice : సైకిల్‌పై రూ. 1.51 లక్షల రోడ్డు ట్యాక్స్.. నోటీసులు జారీ.. షాక్ అయిన యజమాని

వధువు కూడా తక్కువేం తినలేదులెండి. నీలో నేను సగమైనా.. నీతో నేనూ సమానమే అన్నట్టుగా.. బ్యాలెన్స్ కోసం అతడి భుజాలు పట్టుకుని మరి అతడికి ముద్దుతోనే బదులిచ్చింది. వధూ, వరుల ముద్దులాట ఏ రేంజులో ఉందంటే.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయ.. తామేదో పడకగదిలో ఏకాంతంగా (Bed room matters) ఉన్నమన్నట్టుగా ఉంది. వాళ్ల ముద్దులాట చూసి షాకవడం పెళ్లికి వచ్చిన వారి వంతయ్యింది.

Also read : Viral Video: శాంతాక్లాజ్ టోపి ధరించి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్న పాము, వీడియో వైరల్

Also read : Shocking Viral Video: మిరాకిల్.. పిడుగు పడ్డా అతను బతికి బయటపడ్డాడు... వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More