Home> సోషల్
Advertisement

Viral Video: శ్రీవల్లీ పాటలోని ఐకానిక్ స్టెప్పును అనుకరించిన చింపాంజి - వీడియో వైరల్

Viral Video: 'పుష్ప' సినిమాలోని 'శ్రీవల్లీ' పాటకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అందరికి తెలుసు. ఈ పాటలోని అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్పును అనుకరిస్తూ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది వీడియోలు షేర్ చేశారు. ఇప్పుడా పాటకు ఓ చింపాజీ కూడా ఐకానిక్ స్టెప్పు లేసింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 
 

Viral Video: శ్రీవల్లీ పాటలోని ఐకానిక్ స్టెప్పును అనుకరించిన చింపాంజి - వీడియో వైరల్

Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మంధాన కలిసి నటించిన చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం గతేడాది డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇందులోని అల్లు అర్జున్ ఆహార్యం, ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి. ముఖ్యంగా ఇందులోని సాంగ్స్ వల్లనే సినిమాకు హైప్ వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేవీశ్రీప్రసాద్ సంగీతానికి ప్రతి ప్రేక్షకుడూ ఫిదా అయ్యాడు. 

దీంతో పాటు ఈ సినిమాలోని పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు 'శ్రీవల్లీ' సాంగ్ లోని సింపుల్ స్టెప్పును అనుకరిస్తూ వీడియోలను అప్ లోడ్ చేశారు. కానీ, ఆ సినిమా విడుదలై దాదాపుగా మూడు నెలలకు పైగా గడిచినా.. శ్రీవల్లీ పాటకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. 

శ్రీవల్లీ పాటలోని అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్పును ఇప్పుడు ఓ జంతువు కూడా అనుకరించింది. జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఓ చింపాజి.. శ్రీవల్లీ పాటలోని సిగ్నేచర్ స్టెప్పుతో సందర్శకులను అబ్బుర పరిచింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dinesh Sanu (@dinesh_adhi)

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. చింపాంజి డ్యాన్స్ చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పటి వరకు 20 మిలియన్లకు పైగా వీక్షణలు లభించాయి. 11 లక్షలకు పైగా వీడియోను లైక్ చేశారు. 

Also Read: Desi Spiderman: దేశీ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇది చూడండి!

Also Read: Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More