Home> సోషల్
Advertisement

Monkey love video: తల్లి ప్రేమ అంటే అంతే మరి.. మనుషులలైనా.. జంతువులైన!

Monkey love video: లోకంలో హద్దులు లేనిది తల్లి ప్రేమ. అలాంటి తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ఇంటర్నెట్​లో వైరల్ అవుతుంది. ఆ వీడయో మీకూ చూడాలని ఉందా?

Monkey love video: తల్లి ప్రేమ అంటే అంతే మరి.. మనుషులలైనా.. జంతువులైన!

Monkey love video: ప్రేమ గురించి ఎవరు ఎన్ని చెప్పినా.. అవన్నీ మాతృ ప్రేమ తర్వాతే. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో తల్లి పిల్లలపై చూపించినంత ప్రేమ.. ఇంకెరూ ఎవరిపైనా (Mother's Love) చూపించలేరు.

తాను తిన్నా తినకపోయినా.. బిడ్డ ఆఖలి గురించే తల్లి ఆరాటం. బిడ్డకు ఏమైనా చిన్న గాయమైనా తల్లి గుండె తల్లడిల్లుతుంది. తల్లికి తనకంటూ ఓ ప్రపంచం ఉందంటే అది పిల్లలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ప్రేమ గురించి ఎంతైనా చెప్పొచ్చు. కానీ ఎంత చెప్పినా అమ్మ ప్రేమ ముందు అవన్నీ తక్కువే.

తల్లి ప్రేమ ఎక్కడైనా ఒక్కటే..

అందుకే తల్లి ప్రేమను మించిన ప్రేమ మరోటి లేదని నానుడి. అయితే ఈ తల్లి ప్రేమ అనేది మనుషులకు మాత్రమే మాత్రమే పరిమితం కాలేదు. జంతవులైనా తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి (Animals love) మార్పు ఉండదు.

ఆ జంతువులు ఎంత చిన్నవి, ఎంత పెద్దవి అన్న తేడా లేదు. తన పిల్లలంటే తల్లికి అమితమైన ప్రేమ. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు సురక్షితంగా, సంతోషంగా ఉండటం కోసం ఎంతటి బాధనైన బరిస్తుంది మాతృమూర్తు.

ఇలా తల్లి ప్రేమకు చిహ్నంగా నిలిచే ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​లో ట్రెండ్ అవుతోంది. ఓ కోతి తన బిడ్డపై చూపించే ప్రేమను కొందరు ఔత్సాహికులు తమ కెమెరాల్లో బందించి.. ఆ వీడియోను ఇంటర్నెట్​లో (Viral video) పెట్టారు.

వీడియోలో ఏముందంటే..

తల్లి కోతి చెట్టుపై కూర్చును ఉండగా.. పిల్ల కోతి పక్కనే ఉన్న ఓ కొమ్మను పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. బిడ్డ కోతి పైకి ఎక్కడం గమనించిన తల్లి కోతి.. అది పైకి ఎక్కడం ప్రమాదమని భావించి.. కాలు పట్టి కిందకు (Monkey love) లాగుతుంది.

అయితే పిల్ల కోతికి మాత్రం తనను కిందకు లాగటం నచ్చదు. దీనితో తల్లి ముఖాన్ని కొరుకుతూ దాని కోపాన్ని వ్యక్తం చేస్తుంది. అలా పిల్ల కోతి తన ముఖాన్ని కోరుకుతున్నా.. తల్లి కోతి మాత్రం ఏ మాత్రం దానిని విడిపించుకునేందుకు ప్రయత్నం చేయలేదు. పైగా అది తన ముఖాన్ని కొరుకుతుంటే.. మాతృత్వపు ప్రేమను ఆస్వాధిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోను చూస్తే.. భాష అవసరం లేకుండానే తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

Amazing Nature అనే ట్విట్టర్​ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్​ చేశారు. ఈ వీడియోకు 'The Language of Love' అనే క్యాప్షన్​ను జోడించారు.

ట్విట్టర్​ యూజర్ల కామెంట్స్ ఇలా..

ఈ వీడియో చూసిన వారిలో చాలా మంది తల్లి ప్రేమ గొప్పతనం గురించి వర్ణిస్తున్తున్నారు. మాతృప్రేమ ఎప్పటికీ అనిర్వచనీయమైందని ఒకరు స్పందించగా.. ప్రేమ అన్నింటికంటే శక్తిమంతమైన ఎమోషన్ అని మరోకరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వందలాది మంది అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పుకుంటున్నారు.

ఇప్పటి వరకు ఈ వీడియోను 3.10 లక్షల మంది వీక్షించారు. 18.9 వేల లైక్స్ వచ్చాయి.

Also read: Dreams Interpretation: కలలకు అర్ధాలుంటాయనేది ఎంతవరకు నిజం, ఆ కలలకు అర్ధమేంటి

Also read: Cheetah: మూడు తలల చిరుత.. మంత్ర ముగ్ధులను చేస్తోన్న అతని ఫోటోగ్రఫీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Read More