Home> సోషల్
Advertisement

Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

Venomous Snake: పాములు తరచుగా తమశరీరంలోని చర్మంను ఒలుచుకుంటాయి. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయని, వాటి దగ్గరకు వెళ్లే సాహాసం అస్సలు చేయకూడదంటూ కూడా నిపుణులు చెబుతుంటారు.
 

Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

Venomous snake started to shed his skin: పామంటే ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు ఉంటుంది. చాలా మంది పాముల పేర్లు ఎత్తడానికి కూడా అస్సలు సాహాసం చేయరు. ఎక్కడైన పాములు కన్పిస్తే భయంతో  ఆ ప్రదేశం చుట్టపక్కల కూడా వెళ్లరు. అయితే.. పాములు కొన్ని సందర్బాలలో మన ఇళ్ల చుట్టుపక్కలకు వస్తుంటాయి. పొలాలు, నీళ్లు,కొండల ప్రాంతంలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఎలుకల వేటలో పాములు మన  ఇళ్ల దగ్గరకు వస్తుంటాయి. పాములను చాలా మంది దేవుడిలాకొలుస్తారు. అస్సలు హనీ తలపెట్టరు. పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ టీమ్ కు సమాచారం ఇస్తారు. అంతేకాకుండా.. పాముల్ని పట్టుకుని దూర ప్రాంతాలో వదిలేయాలని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం పాములను చంపుతుంటారు. ఇలా చేయడం వల్ల జాతకంలో అనేక దోషాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు.

 

అందుకే పాములను చంపకూడదంటారు. పాములను చంపడం వల్ల.. పెళ్లిళ్లు జరగవు. ఒక వేళ జరిగిన పిల్లలుపుట్టరు. అంతేకాకుండా..జీవితంలో గ్రోత్ ఉండదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. జీవితంలో అనేక  కష్టాలపాలౌతుంటారు. మన దేశంలో కొన్ని వందల రకాలు పాములు కన్పిస్తుంటాయి. కొన్ని విషపూరితమైతే మరికొన్ని విషంలేనివిగా ఉంటాయి. అయితే.. పాములు అత్యంత అరుదుగా తమ కుబుసంను విడుస్తాయి. పాము కుబుసం విడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాములు తమ చర్మంను ఒలుచుకునే సమయంలో చాలా ఏకాతంగా ఉంటాయంట. మనిషి అలజడి కానీ, మరేతర జంతువుల అలజడిలేని ప్రదేశంకు వెళ్లి చర్మం ఓలిచే పనిలో ఉంటాయంట. ఆసమయంలో పాములు చాలా కోపంగాను ఉంటాయంట. కుబుసం విడిచేక్రమంలో ఏ జీవులైన లేదా ఎవరైన డిస్టర్బ్ చేస్తే బలంగా కాటేస్తాయంట. ఆ సమయంలో పాముల విషం ఎక్కువగా ఉంటుందంట. కుబుసం తెల్లగా ఉంటుంది. కుబుసం వదిలేటప్పుడు శరీరంనుంచి ఒక రకమైన ద్రావణం లాంటి పదార్థం కూడా బైటకు వస్తుందంట.

Read more: Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..

ఆసమయంలో పాములు కన్పిస్తే దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాములు కొన్నిసార్లు దూరంగా ఉన్న కూడా గాల్లో ఎగిరి వచ్చి కాటేస్తుంటాయి. కొన్నిపాములు సెకన్లవ్యవధిలో గాల్లో వచ్చి మరీ కాటు వేస్తుంటాయి. ఈ వైరల్ గా మారిన వీడియోలో కూడా ఒక పాము తన శరీరంపైన ఉన్న చర్మంను ఒలుచుకుంటుంది. అంతేకాకుండా.. కుబుసం పూర్తిగా వెళ్లి పోయే వరకు గుండ్రంగా తిరుగుతూ తిరుగుతుంది. ఇది ఎక్కవ జరిగిందో కానీ వివరాలు లేవు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More