Home> సోషల్
Advertisement

Thunderstorm Video: కారుపై పడిన పిడుగు, ఫ్లోరిడాలో జరిగిన ఘటన, వీడియో వైరల్

Thunderstorm Video: పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నప్పుుడు ఇంట్లో కూర్చుంటేనే భయమేస్తుంది. అటువంటిది రోడ్డుపై పిడుగు పడి..అదే రోడ్డుపై మీరు ప్రయాణిస్తుంటే ఇంకెలా ఉంటుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ.. అదే జరిగింది అక్కడ..

Thunderstorm Video: కారుపై పడిన పిడుగు, ఫ్లోరిడాలో జరిగిన ఘటన, వీడియో వైరల్

Thunderstorm Video: పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నప్పుుడు ఇంట్లో కూర్చుంటేనే భయమేస్తుంది. అటువంటిది రోడ్డుపై పిడుగు పడి..అదే రోడ్డుపై మీరు ప్రయాణిస్తుంటే ఇంకెలా ఉంటుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ.. అదే జరిగింది అక్కడ..

అమెరికా ఫ్లోరిడాలో జరిగిన సంఘటన ఇది. ఆ మహిళ మైకేల్ కారులో ప్రయాణిస్తోంది. జూలై 1వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో కారులో ఆ మహిళ పిల్లలతో ప్రయాణిస్తుండగా..ఎదుట ఓ ట్రక్కులో భర్త ఎడ్వర్డ్ వాలెన్ ట్రక్కులో వెళ్తున్నాడు. చుట్టూ భారీ వర్ఖం. మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. అటూ ఇటూ పిడుగులు పడుతుంటే..వెనుక కారులో ఉన్న మైకేల్..ఆ దృశ్యాల్ని మొబైల్‌లో చిత్రీకరిస్తోంది. హఠాత్తుగా ఓ భయంకరమైన పిడుగు తన ఎదురుగా వెళ్తున్న ట్రక్కుపై పడింది. భారీగా శబ్దం.మంటలు. ఆ ధాటికి తన కారు కూడా కదిలిపోయింది. ఇదంతా మొబైల్ లో రికార్డైంది. 

తన భర్త ఎడ్వర్డ్ ప్రయాణిస్తున్న ట్రక్కుపై పడింది ఆ పిడుగు. దాంతో ఆ ట్రక్కు మొత్తం మంటలకు ఆహుతైంది. భర్త ఇతర వ్యక్తులు బయటపడ్డారు. ఇదిలా చదువుతుంటేనే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంటే..నేరుగా తనెదురుగా జరిగిన ఘటన, తన మొబైల్‌లో రికార్డైన ఆ భయంకరమైన దృశ్యాన్ని ఎలా మర్పిపోతుంది. ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చాలా సేపటి వరకూ తేరుకోలేకపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. కానీ ట్రక్ మొత్తం కాలిపోయింది.

ఉరుములు, మెరుపులు పడినప్పుుడు సహజంగానే కార్లు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటాయి. కారులోని ఎలక్ట్రిక్ సిస్టమ్, విండోస్, టైర్లు పాడవుతుంటాయి. ఇప్పుడీ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది. 

Also read: Girl Dance Video: డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిపై గుర్రానికి కోపమెందుకొచ్చింది, వీడియో వైరల్

 స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More