Home> సోషల్
Advertisement

Viral Video: టీచర్​కు పాటతో వీడ్కోలు పలికిన విద్యార్థులు- వీడియో వైరల్​..

Viral Video: బదిలీ అయిన టీచర్​కు ఏడూస్తూ విద్యార్థుల వీడ్కోలు పలికారు. విద్యార్థుల ప్రేమను చూసి భావోద్వేగానికి లోనైనయ్యారు ఆ టీచర్​.ఇంటర్నెట్​లో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూద్దామా!

Viral Video: టీచర్​కు పాటతో వీడ్కోలు పలికిన విద్యార్థులు- వీడియో వైరల్​..

Viral Video: ప్రస్తుత సమాజంలో స్కూళ్లో టీచర్లు, విద్యార్థులకు పెద్దగా సంబంధాలు ఉండటం లేదు. ముఖ్యంగా టీచర్లు తాము పాఠాలు చెప్పామా.. పని ముగించుకున్నామా.. అనేట్లు ఉంటుంటారు. విద్యార్థులు కూడా పాఠాలు నేర్చుకున్నామా.. తరగతులు మారామా అనే విషాయనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

పిల్లలతో కలిసిపోయే టీచర్లు.. టీచర్లను దైవం ఆరాదించే విద్యార్థులు చాలా అరుదు. ఇప్పుడు కూడా అలాంటి టీచర్లు, విద్యార్థులు ఉన్నారని ఓ సంఘటన ద్వారా తెలిసింది.

టీచర్​, విద్యార్థుల మధ్య.. ఏర్పడిన గొప్ప బంధానికి నిదర్శనంగా నిలిచే ఓ ఘటన పశ్చిమ్​ బెంగాల్​లోని ఓ స్కూళ్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​లో వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే.. 

ఆ స్కూళ్లో సంపా అనే ఓ టీచర్​.. బదిలీ సందర్భంగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్కూల్​కు గుడ్​ బై చెప్పాల్సి వచ్చింది. అయితే అమె చివరి పని రోజు.. విద్యార్థులు అమెకు వినూత్నంగా వీడ్కోలు చెప్పారు. నిజానికి దీని వీడ్కోలు అని చెప్పడం కన్నా టీచర్​పై విద్యార్థులు తమకు ఉన్న ఆప్యాయతను వ్యక్తం చేయడం అని చెప్పడం మేలు.

విద్యార్థులంతా ఓక చోట నిలబడ్డారు.. మరో విద్యార్థి సంపా టీచర్​ను కళ్లు మూసుకుని అక్కడకు తీసుకొచ్చింది. ఆ విద్యార్థి టీచర్​ కళ్లు తరవగా.. ఒక్క సారిగా విద్యార్థులంతా టీచర్​కు ఎర్ర గులాబీలు ఇచ్చారు.

ఆ తర్వాత టీచర్​ ముందు మోకాళ్లపై కూర్చున్నారు. టీచర్​ను ఉద్దేశిస్తూ.. షారుక్​ ఖాన్, అనుష్క శర్మల హిట్​ మూవీ రబ్​ నే బనాది జోడీ సినిమాలోని.. రబ్ నే బనాదీ జోడీ పాటను పాడారు.

విద్యార్థులకు తనపై ఉన్న ప్రేమను చూసి సంపా టీచర్​ భావోద్వేగానికి లోలయ్యారు. విద్యార్థులు కూడా తమ ప్రేమను కన్నీళ్లతో వ్యక్తపరిచారు. ఈ అద్భుతమైన, అరుదైన సంఘటనను కొంత మంది విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఒక టీచర్​కు ఇంతలా ఏడస్తూ వీడ్కోలు పలుకుతుండటం చూసి ఆశ్యర్యపోతున్నారు. కొందరేమో 'ఆచార్య దేవో భవ' అనే సూక్తికి సరైన నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read: Viral Video: గుండెలు పిండేసిందిగా.. హోమ్ సిక్‌లో ఉన్న అబ్బాయిని ఓదార్చుతున్న అమ్మాయి!

Also read: Cycle Stunt Video: ఇది మామూలు స్టంట్ కాదు.. చూస్తే పడి పడి నవ్వుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More