Home> సోషల్
Advertisement

Chai GPT: చాట్ జీపీటీ కాదిది..చాయ్ జీపీటీ, క్రియేటివిటీ అదిరింది గురూ

Chai GPT: ఆధునిక బిజీ ప్రపంచంలో రాణించాలంటే విభిన్నంగా ఆలోచించాలి. విభిన్నంగా వ్యవహరించాలి. విభిన్నమైన వ్యాపారంలో అడుగుపెట్టాలి. ఒక్క విభిన్నమైన ఆలోచన సక్సెస్ కూడా తెచ్చిపెడుతుంటుంది. 

Chai GPT: చాట్ జీపీటీ కాదిది..చాయ్ జీపీటీ, క్రియేటివిటీ అదిరింది గురూ

Chai GPT: రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ది చెందుతోంది. జనం విభిన్నరకాలుగా టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ కొత్త కొత్త ఆవిష్కరణలు కన్పిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్చుకుంటున్నారు. ఓ వ్యక్తి వినూత్న ఆలోచన ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇటీవల గత కొద్దికాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర అధికమౌతోంది. దీని ద్వారా వివిధ రంగాల్లో కీలకమైన పనులు పూర్తవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చాట్ బాక్స్.. చాట్ జీపీటీ రూపుదిద్దుకుంది. చాట్ జీపీటీ పదం బహుశా అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీలు చాట్ జీపీటీని వాడుకలో తెచ్చేస్తున్నాయి. చాట్ జీపీటీ పదం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే వినూత్న ఆలోచనలకు దారితీస్తోంది. ఓ వ్యక్తి ఈ పేరును ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నాడు. ఏకంగా టీ వ్యాపారానికి చాట్ జీపీటీ పేరు వాడేస్తున్నాడు. తన క్రియేటివిటీతో అందర్నీ తన టీ షాపుకు ఆకట్టుకుంటున్నాడు. 

చాలామంది నిరుద్యోగులు పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాల్లేక టీ దుకాణాలు పెట్టుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అందర్నీ ఆకర్షిస్తున్న చాట్ జీపీటీ  పేరును అనుకరించి..చాయ్ జీపీటీ పేరుతో ఓ టీ దుకాణం తెరిచేశాడు. చాట్ జీపీటీ స్థానంలో చాయ్ జీపీటీ పేరు పెట్టుకున్నాడు. దూరం నుంచి చూసినా లేదా ఏమరపాటులో చదివినా చాట్ జీపీటీ అనే అనుకుంటారు. ఇదేదో వెరైటీగా ఉంది కదా అని షాపుకు వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే ఈ పేరు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ నోటా ఈ నోటా ప్రాచుర్యం పొంది ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇదొక టీ కొట్టు మాత్రమే. ఇక్కడ చాట్ జీపీటీ సాఫ్ట్‌వేర్ అమ్మరు. చాయ్ మాత్రమే లభిస్తుంది. ఓ వ్యక్తకి ఇటీవలే ఈ షాపు ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతే వైరల్ అవడం మొదలైంది. ఫోటో కింద రైటప్ కూడా ఎలా రాశాడంటే...సిలికాన్ వ్యాలీ సోదరులారా..మన వద్ద స్టార్ట్ అప్స్ కోసం అద్భుతమైన ఐడియాలున్నాయంటూ రాసుకొచ్చాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోకు ఇప్పటికే లక్షలాది లైక్స్, వ్యూస్ లభించాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రాచుర్యంలో రావడంతో చాయ్ జీపీటీ రుచి చూసేందుకు జనం ఎగబడుతున్నారు కూడా.

ఫోటోలో కన్పిస్తున్న టీ దుకాణం ఇది. దుకాణంపై వైట్‌బోర్డ్ కన్పిస్తోంది. బోర్డ్‌పై టీ గ్లాసు సింబల్ ఉండి పక్కన చాయ్ జీపీటీ అని రాసుంది. ఇది ఆ దుకాణదారుడి క్రియేటివిటీ. చాట్ జీపీటీలో టి అక్షరాన్ని తొలగించి ఐ అక్షరాన్ని జోడించాడు. అంతే చాయ్ జీపీటీ అయిపోయింది. ఇక జీపీటీ ఫుల్ ఫామ్ కూడా మార్చేశాడు. కింద ట్యాగ్‌లైన్ కింద Genuinely Pure Tea అని రాశాడు. పుల్ ఫామ్ అదిరింది కదా. ఈ వ్యక్తి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడిపై ప్రశంసలు కురిపించేస్తున్నారు. 

Also read: Suchetana Bhattacharya: మాజీ సీఎం కూతురు లింగ మార్పిడి వ్యవహారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More