Home> సోషల్
Advertisement

Watch Video: బాకెట్ నిండా కింగ్ కోబ్రా పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్..ఇంతకీ తల్లి పాము ఏం చేసిందంటే..

King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పాము పిల్లలకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్నేక్ క్యాచర్ పిల్లలను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఇంతకుముందు ఇలాంటి వీడియోని చూశారా? చూడకపోతే ఓ లుక్కేసుకోండి.

Watch Video: బాకెట్ నిండా కింగ్ కోబ్రా పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్..ఇంతకీ తల్లి పాము ఏం చేసిందంటే..

King Cobra Viral Video: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని అనుకోకుండా తీసిన ఫన్నీ సన్నివేశాలు అయితే.. మరికొన్ని జంతువులు పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అప్పుడప్పుడు కొంతమంది స్నేక్ క్యాచర్స్ ఎంతో రిస్క్ చేసి పాములను పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ కింగ్ కోబ్రాని పట్టుకున్న వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో పాము పిల్లలను పట్టుకున్న వీడియోలను షేర్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో నిలిచింది. 

వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ పడావుబడ్డ ఇంటిలో భారీ కింగ్ కోబ్రా పిల్లలకు జన్మనిస్తుంది. అయితే దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం అందిస్తాడు. దీంతో ఆ స్నేక్ క్యాచర్ హుటాహుటిన ఆ పాత ఇంటికి చేరుకుంటాడు. ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికులు పాము పిల్లలను గుర్తించి స్నేక్ క్యాచర్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీంతో ఆయన నెమ్మదిగా వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ పాము పిల్లలకు సంబంధించిన తల్లి లేకపోవడంతో స్నేక్ క్యాచర్ పిల్లలను పట్టుకొని ఓ ప్లాస్టిక్ బకెట్ లో వేస్తాడు. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

ఇలా కొన్ని పిల్లలను చేత్తో పట్టుకొని ఒక్కొక్కటిగా స్నేక్ క్యాచర్ తన వెంట తీసుకువచ్చిన బకెట్లో వేస్తాడు. ఇలా పట్టుకునే క్రమంలో కొన్ని పిల్లలు పారిపోయేందుకు ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఎంతో తేలికగా వాటిని పట్టుకోవడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా కొన్ని పిల్లలు ఆ ఇంటి గోడలో నుంచి కూడా బయటికి వస్తాయి. అయితే ఆయన వాటిని కూడా పట్టుకొని ఆ బకెట్ లో వేస్తాడు. ఇలా అన్ని కింగ్ కోబ్రా పిల్లలను పట్టుకొని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేస్తాడు. 

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా లభిస్తాయి. ఈ వీడియోను @ Mirzamdarif అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించగా.. ఈ పాము పిల్లలను రక్షించిన స్నేక్ క్యాచర్‌ను అభినందిస్తున్నారు. ఏదేమైనా స్నేక్ క్యాచర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పాములను రక్షిస్తున్నందుకు నిజంగా వారికి ధన్యవాదాలు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More