Home> సోషల్
Advertisement

Big King Cobra Viral Video: వీడబ్బా.. ఏంట్రా ఆ ధైర్యం.. కింగ్ కోబ్రా కాటేయటానికి వస్తే .. కాస్త కూడా భయం లేకుండా!

Big Size King Cobra Viral Video: ఓ వైపు ఆ నాగు పాము పడగ విప్పి మరీ బుసలు కొడుతుంటే.. అతడు మాత్రం ఆ నాగు పామును చూసి భయపడకుండా, ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరూ చూస్తుండగానే క్షణాల్లో పామును ముందు నుంచే పట్టుకున్న తీరు చూస్తే అతడి ధైర్యానికి సాహో అని అనాల్సిందే.

Big King Cobra Viral Video: వీడబ్బా.. ఏంట్రా ఆ ధైర్యం.. కింగ్ కోబ్రా కాటేయటానికి వస్తే .. కాస్త కూడా భయం లేకుండా!

Big Size King Cobra Viral Video: చిన్న నాగు పామును వెనుక నుంచి చూస్తేనే కొంతమంది హడలిపోతుంటారు. అలాంటిది భారీ పొడవు, లావు ఉన్న నాగు పామును చూస్తే ఇక అక్కడి నుంచి ఏకంగా పరుగు అందుకునే వాళ్లు కూడా ఉంటారు. నాగు పాము అంటే కొంతమందికి అంత భయం. అవి మీదకు వచ్చే తీరు, పడగ విప్పి బుసలు కొట్టే తీరు ఆ భయానికి ఒక కారణం అయితే,.. అవి విషపూరితమైన జాతి సర్పాలు కనుక.. ఆ పాములు కరిస్తే బతికే అవకాశాలు తక్కువే అనే భయం ఉండటం మరో కారణం. అందుకే నాగు పామును చూస్తే చాలు హడలిపోతుంటారు.

అయితే, పాములను చూసి హడలిపోయే వాళ్లు కొందరైతే.. ఎంత భయంకరమైన పాములను చూసినా ఏ మాత్రం జంకకుండా వాటికి ఎదురెళ్లి మరీ పట్టుకునే వాళ్లు ఇంకొంత మంది ఉంటారు. వాళ్లకు ఎంత పెద్ద నాగు పాములను చూసినా భయం కాదు. పైగా పాము సైజు, ఆకారం పెరిగే కొద్ది వారికి ఆ పాములను పట్టడం ఒక సవాలుగా తీసుకుంటుంటారట. అందుకే పాములను చూసి పారిపోకుండా వాటికి ఎదురెళ్లి తమ నైపుణ్యాలను, ధైర్య సాహసాలకు పదును పెట్టుకుంటుంటారు. ఇదిగో ఇక్కడ యూట్యూబ్ లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీకు కూడా ఎగ్జాట్లీ అదే నిజం అని అనిపిస్తుంది. 

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక భయంకరమైన నాగు పామును ఏ మాత్రం భయం లేకుండా ఎదురుగా వెళ్లి మరి చేత పట్టుకున్నాడు. ఓ వైపు ఆ నాగు పాము పడగ విప్పి మరీ బుసలు కొడుతుంటే.. అతడు మాత్రం ఆ నాగు పామును చూసి భయపడకుండా, ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా అందరూ చూస్తుండగానే క్షణాల్లో పామును ముందు నుంచే పట్టుకున్న తీరు చూస్తే అతడి ధైర్యానికి సాహో అని అనాల్సిందే. చూడ్డానికి ఒళ్లు జలధరించే భారీ కింగ్ కోబ్రాను అతడు హ్యాండిల్ చేసిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతడికి అంత మొండి ధైర్యం ఎందుకు అనే సందేహం కూడా వస్తుంది. 

ఇది కూడా చదవండి: Huge Dangerous King Cobra: పడగ విప్పిన పాముకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న మొనగాడు!

ఏం మాయ చేశాడో.. ఎక్కడ ఈ విద్యను నేర్చుకున్నాడో తెలియదు కానీ.. అంత బుసలు కొట్టే పామును కూడా ఎదురుగా వెళ్లి మరీ పట్టుకున్నాడు. ఆ పాము కోరలు చాచి కాటేసేందుకు ముందుకు వచ్చి బుసలు కొడుతున్నా.. అతడి ముఖంలో ఏ మాత్రం భయం కనిపించలేదు. సింపుల్ గా బొమ్మ పామును పట్టుకున్నట్టే పట్టుకున్నాడు. ఆ పాము చాలా లావుగా ఉండటంతో పాటు అతడి కంటే పొడుగు కూడా ఉంది అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోను 17 మిలియన్ల మంది వీక్షించారు. కొన్ని వందల సంఖ్యలో జనం కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి: King Cobra in Car Dicky: కారు డిక్కీలో పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. పట్టుకోవాలని చూసిన సాహెబ్ కు తడిపించేసిన స్నేక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More