Home> సోషల్
Advertisement

Water Skiing World Record: 6 నెలల బుడ్డోడు ప్రపంచ రికార్డు

6 Months Baby Water Skiing | నీళ్లంటేనే భయపడేవాళ్లు చాలా మంది ఉంటారు.  కానీ అమెరికాకు చెందిన ఓ బుడ్డోడు 6 నెలలకే వాటర్ స్కీయింగ్‌కు ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టాడు. తానేం చేశాడో ఆ చిన్నారికి మాత్రం తెలియదు.

Water Skiing World Record: 6 నెలల బుడ్డోడు ప్రపంచ రికార్డు

సాధారణంగా భారీ మొత్తంలో నీళ్లను చూస్తే కొందరికి కళ్లు తిరుగుతాయి. కొందరు జలగండం అని భయపడుతుంటారు. కానీ అమెరికాకు చెందిన ఆరు నెలల బుడ్డోడు అద్భుతం చేశాడు. అలలపై అలా తేలిపోయిన ఆ బుజ్జాయికి తాను ప్రపంచ రికార్డు నెలకొల్పానని తెలియదు. ఇంతకీ ఆ విశేషం ఏంటంటే.. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో వాటర్ స్కీయింగ్ చేసిన వ్యక్తిగా 6 నెలల బుజ్జాయి రికార్డు నెలకొల్పాడు. దీంతో ఏకంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు.

క్యాసే, మిండి హంప్రేస్ దంపతులు సంతానమే 6 నెలల చిన్నారి రిచ్ హంప్రేస్. ఈ మధ్య నెల నెలా పిల్లల 1వ నెల పుట్టినరోజు, 2వ నెల బర్త్ డే అని చేస్తున్నారు. కదా రిచ్ హంప్రేస్ తల్లిదండ్రులు వినూత్నంగా ఆలోచించారు. చిన్నారి 6వ నెల బర్త్ డే సందర్భంగా పావెల్ సరస్సుకు తీసుకెళ్లారు. అక్కడ రిచ్ హంప్రెస్‌తో సురక్షితంగా వాటర్ స్కీయింగ్ చేయించారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I went water skiing for my 6 month birthday. Apparently that’s a big deal… #worldrecord

A post shared by Rich Casey Humpherys (@richcaseyhumpherys) on

వాటర్ స్కీయింగ్‌కు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నెలల చిన్నారి రిచ్ హంప్రేస్ ఏ భయం లేకుండా వాటర్ స్కీయింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారికి లైఫ్ జాకెట్ వేసి, సురక్షితంగా ఉండేలా చిన్న బోటు పరికరానికి జాగ్రత్తగా కట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాకున్నా రిచ్ హంప్రేస్ భలే ఎంజాయ్ చేశాడు. ఈ సమయంలో బాబు పేరెంట్స్ పక్కన మరో బోటులో ఉంచి ఈ ఫీట్‌ను పర్యవేక్షించారు. Crab Smoking Video: దర్జాగ సిగ‌రెట్ తాగుతున్న పీత : నెటిజన్లు షాక్ 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More