Home> సోషల్
Advertisement

Banana Snake: ఇది అరటి పండు కాదు..భయంకరమైన పాము

Banana Snake: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియా చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఓ అరటి పండు. అరటి పండులో వింతేముంది..ఎందుకు వైరల్ అవుతుందనుకుంటున్నారా..

Banana Snake: ఇది అరటి పండు కాదు..భయంకరమైన పాము

Banana Snake: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియా చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఓ అరటి పండు. అరటి పండులో వింతేముంది..ఎందుకు వైరల్ అవుతుందనుకుంటున్నారా..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ చిత్ర విచిత్రమైన వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కొన్ని వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆసక్తి కల్గించేవి ఉంటే...మరికొన్ని షాకింగ్ కల్గిస్తాయి. ఇంకొన్ని వీడియోలు భయం గొలుపుతాయి. ఆలాంటిదే ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అరటి పండు ఉంది. పక్కనే అచ్చం అలానే కన్పిస్తున్న పాము ఉంది. ఆశ్చర్యంగా ఉందా..

ఇది చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. భూమ్మీద ఇలాంటివి కూడా ఉన్నాయా అన్పిస్తుంది. ఓ పక్క భయం కలుగుతుంది. మరోవైపు ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటివి చూసినా సరే నమ్మలేం. అలాంటి వీడియోలు ఇవి. అందుకే ఈ వీడియో అంతలా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఉన్న పాము అచ్చం..నూటికి నూరుశాతం అరటిపండులానే ఉంది. చూసిన వెంటనే అరటి పండే అనుకుంటారు కూడా. చేత్తో పట్టుకున్నప్పుడు కూడా అలానే ఉంటుంది. నోటి భాగం నుంచి నాలుక బయటకు రాకుండా ఉంటే..అరటి పండే అని నమ్మేస్తారు కూడా. ఒళ్లు జలదరిస్తున్న ఈ వీడియో ఎక్కడిదో తెలియదు గానీ..చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా కామెంట్లు వస్తున్నాయి. చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి అల్లాహ్ గొప్పతనాన్ని ప్రశంసిస్తాడు. మరోవ్యక్తి అల్లాహ్ అందరి కంటే గొప్పవాడని కీర్తిస్తాడు. అచ్చం అరటిపండులా కన్పిస్తున్నందున..ఈ పాముని బనానా పైథాన్ అంటున్నారు. 

Also read: Big Billion Days Sale: ల్యాప్‌టాప్‌కి బదులుగా బట్టల సబ్బులు.. కస్టమర్‌కి డబ్బులు రిఫండ్ చేశామన్న ఫ్లిప్‌కార్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More