Home> సోషల్
Advertisement

Elephant vs Lionesses video: ఒంటరి ఏనుగు, 14 సింహాల పోరాటం, చివరికి గెలిచిందెవరు

Elephant vs Lionesses video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగుల వీడియోలకు ఆదరణ ఎక్కువ. ఒకే ఒక ఏనుగు..డజను సింహాల వీడియో తెగ వైరల్ అవుతోంది.

Elephant vs Lionesses video: ఒంటరి ఏనుగు, 14 సింహాల పోరాటం, చివరికి గెలిచిందెవరు

Elephant vs Lionesses video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగుల వీడియోలకు ఆదరణ ఎక్కువ. ఒకే ఒక ఏనుగు..డజను సింహాల వీడియో తెగ వైరల్ అవుతోంది.

సింహం అనేది అడవికి రారాజు. అందుకే వేటాడాలంటే ఏ జంతువునీ వదిలిపెట్టదు. ఒకట్రెండు జంతువులు మినహాయించి అన్నింటిపై దాడి చేస్తుంది. సోషల్ మీడియాలో వైల్డ్ యానిమల్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఇందులో ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా డజను అడ సింహాలు ఒక ఏనుగుపై దాడి చేస్తున్నాయి. అన్ని సింహాలు ఒకేసారి దాడికి దిగినా ఆ ఏనుగు అదరలేదు.బెదరలేదు.రౌద్రంగా తిరగబడింది. అన్నింటినీ చెల్లాచెదురు చేసేసింది. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు కూడా స్పష్టంగా చూడవచ్చు. డజనుకు పైగా ఆడ సింహాలు వ్యూహాత్మకంగా ఏనుగును చుట్టుముడతాయి. నలువైపుల్నించీ ఎటాక్ చేస్తాయి. రెండు సింహాలు ఏనుగుపైకెక్కి దాడికి ప్రయత్నిస్తాయి. కానీ ఆ ఏనుగు మాత్రం పరుగెట్టి మరీ వెంబడిస్తుంది. చివరికి అక్కడే ఉన్న నదిలో వెళ్లిపోతుంది. అయినా నదిలో కూడా ఏనుగును వెంటాడుతాయి. ఏనుగు కూడా అంతే భీకరంగా వెనుదిరిగి సింహాల్ని చెదరగొడుతుంది. చాలా సేపు వేటకు ప్రయత్నించి విఫలమౌతాయి. చేసేది లేక వెనుదిరిగిపోతాయి.

ఏనుగుకు ఆడ సింహాలకు మధ్య జరిగిన ఈ పోరాటంలో చివరికి ఏనుగు పైచేయి సాధిస్తుంది. ఒంటరిగా ఉన్నా..14 సింహాలతో పోరాడుతుంది. అన్నింటినీ తరిమి తరిమి కొడుతుంది. 2 నిమిషాల ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. 

Also read: Viral Video: ఆండ్రీ రసెల్ అరుదైన ఫీట్..ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఆల్‌రౌండర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More