Home> సోషల్
Advertisement

Radhika merchant: అంబానీ కోడలా.. మజాకా.. తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన రాధిక మర్చంట్.. వీడియో వైరల్..

Radhika merchant dance: రాధికా మర్చంట్ గణపయ్య ఊరేగింపు కార్యక్రమంలో తన భర్తతో కలిపి పాల్గొన్నారు. అంతేకాకుండా.. అక్కడ ధోల్ బ్యాండ్ కు తగ్గట్టుగా మాస్ స్టెప్పులు వేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
 

Radhika merchant: అంబానీ కోడలా.. మజాకా.. తీన్మార్ స్టెప్పులతో  దుమ్మురేపిన రాధిక మర్చంట్.. వీడియో వైరల్..

Radhika merchant dance in ganesh visarjan in Mumbai: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులు కొనసాగుతున్నాయి. పల్లె పట్నంతేడాలేకుండా ప్రతి చోట కూడా .. బొజ్జ గణపయ్యలను ఏర్పాటు చేసుకుని మరీ పూజించుకుంటారు. చాలా మంది వినాయక నవరాత్రుల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా గణేష్ ఉత్సవాలలో ఫుల్ జోష్ గా పాల్గొంటారు. గణపయ్యను తెచ్చేటప్పుడు.. బ్యాండ్ బాజాలతో ఎంతో గ్రాండ్ గా తీసుకొస్తారో.. తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే వేడుకగా తీసుకెళ్లి మరీ నిమజ్జనం కార్యక్రమం చేస్తారు.

 

ఈ నేపథ్యంలో.. గణపయ్య ముందు ప్రతి ఒక్కరు తీన్మార్ డ్యాన్స్ లు చేస్తుంటారు.ఈ నేపథ్యంలో.. కొంత మంది గణపయ్యను 1 రోజు, 3, 5, 9, 11 ఇలా వాళ్ల ఆచారంను బట్టి గణపయ్యను కూర్చుండబెడుతుంటారు. అయితే.. ముంబైలోకి అంబానీ ఇంట్లో జరిగిన  నిమజ్జన వేడుక ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

పూర్తి వివరాలు.. 

ఇటీవల  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత.. ముఖేష్ అంబానీ,నీతాల ముద్దుల కొడుకు... అనంత్ రాధికల పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలసిందే. వీరి పెళ్లి నభూతో.. న భవిష్యత్ అన్న విధంగా జరిగిందని కూడా చెప్పుకొవచ్చు.ఈ క్రమంలో ముంబైలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు, దేశ, విదేశాల నుంచి సైతం అతిథులు హజరయ్యారు. ఈ క్రమంలో అనంత్ రాధికల పెళ్లికి.. వేల రకాల ఫుడ్ వెరైటీలను అతిథుల కోసం ఏర్పాటు చేసిన విషయం తెలసిందే. మరోవైపు ముఖేష్, నీతాలు పెళ్లి తర్వాత కూడా.. ఫుల్  జోష్ గా అనేక కార్యక్రమాలలో పాల్గొంటు తరచుగా వార్తలో ఉంటున్నారు.

ఇదిలా ఉండగా.. ముఖేష్ అంబానీ ఇంట కొత్త కొడలు వచ్చిన తర్వాత గణపయ్య వేడుకలను ఫుల్ గ్రాండ్ గా నిర్వహించారు. శనివారం జరిగిన వినాయకచవితి వేడుకలకు.. బాలీవుడ్ నుంచి అనేక మంది ప్రముఖులు సైతం పాల్గొన్నారు. శనివారం గణేష్ చతుర్థి సందర్భంగా అంబానీలు తమ నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ మరియు సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే.. తాజాగా, వినాయక నిమజ్జనం కూడా.. అంబానీ ఫ్యామీలీ అంతే గ్రాండ్ గా నిర్వహించింది. ముంబైలోని అంబానీ నివాసమైన.. ఆంటిలియా నుంచి గణపయ్యను.. చౌపాటి బీచ్ కు ఊరేగింపుగా వెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహించారు .దీనిలో రాధికా, అనంత్ అంబానీలు చేసిన డ్యాన్స్ దుమ్మురేపిందని చెప్పుకొవచ్చు. ధోల్ బ్యాండ్ కు.. తగ్గట్టుగా.. అంబానీ కోడలు.. రాధిక భర్తతో పోటీ పడి మాస్ స్టెప్పులు వేశారు. రాధిక, అనంత్ లు గులాల్ చల్లుకుని ఫుల్ జోష్ తో డ్యాన్స్ లు చేస్తు హల్ చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Read More