Home> సోషల్
Advertisement

Puppy Prank Video: చిలిపి కుక్క పిల్ల.. యజమానిపై ఫ్రాంక్! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే

Little Puppy Pulling Prank on Its Owner. ఓ చిలిపి కుక్క పిల్ల తన యజమానిపై ఫ్రాంక్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 

Puppy Prank Video: చిలిపి కుక్క పిల్ల.. యజమానిపై ఫ్రాంక్! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే

Little Puppy Pulling Prank on Its Owner: జంతు ప్రపంచంలో మనిషికి అత్యంత ఆప్త మిత్రులు శునకాలే. శునకాన్ని తప్ప మనిషి మరే ఇతర జంతువులను ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడడు. అందుకే శునకాలు మానవులకు మంచి స్నేహితులు అనడంలో సందేహం లేదు. శునకాలు తమ యజమాని పట్ల ప్రేమ, ఆప్యాయత.. అంతకుమించి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. అదే సమయంలో ఇంట్లో యజమానులు చేసే పనులను చూస్తూ.. అవి కూడా అలవాటు చేసుకుంటాయి. సరదాగా తమ యజమానితో ఆటలు ఆడుతాయి. ఎలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియోలో రెండు అందమైన కుక్క పిల్లలు మేడ మీద నుంచి కిందకు దిగడానికి ప్రయత్నిస్తాయి. ఇంతలో వాటి యజమాని చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని మెట్లు ఎక్కుతుంటాడు. ఇది గమనించిన కుక్క పిల్లలు వెనక్కి వస్తాయి. అందులోని ఒక చిలిపి కుక్క పిల్ల గోడ వెనుక దాక్కుని.. తమ యజమాని వచ్చే వరకు వేచి ఉంటుంది. తమ యజమాని మెట్లు ఎక్కి ముందుకు రాగానే.. కుక్క పిల్ల ఒక్కసారిగా గోడ వెనుక నుంచి వచ్చి యజమానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత యజమాని కాసేపు అలా ఉండగా.. అది కూడా అతడిని చూస్తూ ఉండిపోతుంది. ఆపై ఇద్దరూ సరదాగా ఆడుకుంటూ గదిలోకి వెళ్ళిపోతారు. 

ఈ ఫన్నీ వీడియో జవరోర్ అనే ట్విట్టర్‌ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. 'యజమానిపై కుక్క పిల్ల ఫ్రాంక్. చూడడానికి చాలా అందంగా ఉంది' అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అందరూ నవ్వులు పూయిస్తున్నారు. ఈ వీడియోకి 40 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 4 లక్షలకు పైగా లైక్‌లు రాగా.. దాదాపు 60,000 మంది కామెంట్స్ చేశారు. యజమాని పట్ల ప్రేమ, యజమానిపై ఫ్రాంక్ అదిరింది అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: ENG vs NED: డేవిడ్ మలాన్ భారీ సిక్సర్.. బంతి కోసం తుప్పల్లో తంటాలు పడ్డ నెదర్లాండ్స్ ప్లేయర్స్!  

Also Read: Rishabh Pant: ఇంగ్లండ్‌ పర్యటనకు వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌.. మయాంక్‌ అగర్వాల్‌కు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More