Home> సోషల్
Advertisement

Viral video: ప్రేమికుల మధ్య పెట్రోల్ చిచ్చు.. ప్రేయసిని కలవలేక ప్రియుడి కష్టాలు!

Viral video: పెట్రోల్ రేట్లు పెరగటంపై ఓ యువకుడు వినూత్న రీతిలో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పెట్రోల్ రేట్లు పెరిగాయి నిన్ను కలవడానికి రాలేకపోతున్నా అంటూ.. పాట పాడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసేద్దామా?

Viral video: ప్రేమికుల మధ్య పెట్రోల్ చిచ్చు.. ప్రేయసిని కలవలేక ప్రియుడి కష్టాలు!

Viral video: దేశంలో పెట్రోల్ ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నా.. గత కొన్నాళ్లుగా వరుసగా పెరుగుతూ సామాన్యులకు భారంగా మారాయి. ధరలు క్రమంగా పెరగటం పట్ల సామాన్యులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. మరికొంత మందేమో.. సోషల్ మీడియా వేదికగా మీమ్స్​, ఫన్నీ ట్రోల్స్​ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఓ యువకుడు.. పెట్రోల్ ధరలపై తనదైన శైలిలో ఓ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. తన ప్రేమ కథలో పెట్రోల్ ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో చెబుతూ.. ఓ పాట పాడాడు ఆ యువకుడు.

పాటలో ఏముందంటే..

పెట్రోల్ ధరలు మండిపోవడం వల్ల చాలా మంది సొంత వాహనాలను బయకు తీయడం లేదు. ఇదే విషయాన్ని పాట రూపంలో తన ప్రేయసికి చెబుతున్నట్లు ఆ యువకుడు పాట పాడాడు.

పెట్రోల్​ రేట్లు మండిపోతున్నాయి్.. ప్రేయసి నిన్ను ఎలా కలవను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పాట పాడాడు. మొత్తం 3.55 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను.. మగధి బాయ్స్ అనే ఫేస్​బుక్​ పేజీ షేర్​ చేసింది. ఏప్రిల్ 6న ఈ వీడియోను ఫేస్​బుక్​లో పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 2.12 లక్షల మంది చూశారు. 12వేల మంది లైక్ చేశారు. మరి ఆ వైరల్ సాంగ్​ను మీరూ వినేయండి.

Also read: Petrol Tank Blast Fact Check: ఎండాకాలం బండ్లలో పెట్రోల్ ట్యాంక్​ ఫుల్​ చేస్తే ప్రమాదమా?

Also read: Pushpa in Exam: ఆన్సర్​ షీట్​లో 'పుష్ప పుష్ప రాజ్​' డైలాగ్​.. వైరల్ అవుతోన్న ఫొటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More