Home> సోషల్
Advertisement

Viral video: దుబాయ్​ వీధుల్లో పురి విప్పిన నెమలి అందాలు.. వీడియో వైరల్​!

Viral video: మనుషులతో సందడిగా ఉండే దుబాయ్ విధుల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో నెమళ్లు రోడ్డు పక్కల కనువిందు చేశాయి.

Viral video: దుబాయ్​ వీధుల్లో పురి విప్పిన నెమలి అందాలు.. వీడియో వైరల్​!

Viral video: నెమలి లాంటి పక్షులను చూడాలంటే గ్రామాల్లోనే లేదా అడవుల్లోనే సాధ్యం. సిటీల్లో నెమళ్లు కనిపించడం అనేది అత్యంత అరుదు. అలా కనిపించినా.. ఎప్పుడో ఒకటో రెండో దారి తప్పి అలా వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంటాయి.

అయితే దుబాయ్​లో అంతకు మించి అరుదైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై, చుట్టుపక్కల నెమళ్లు ఒక్కసారిగా సందడి (Peacocks strolling in Dubai street) చేశాయి.

పార్క్​లో ఉన్నట్లు పదుల సంఖ్యలో నెమళ్లు ఒక్క సారిగా రోడ్డుపైకి వచ్చాయి. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే.. ఇందులో ఆడ, మగ నెమళ్లు కలిసి ఉండటం గమనార్హం. సాధారణంగా అవి రెండు ఒక చోట తక్కువగా ఉంటాయి. కాని ఇక్కడ అన్ని కలిసి పదుల సంఖ్యలో ఉన్నాయి.

ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే.. ఓ నెమలి అందగా పురి విప్పి నాట్యంతో కనువిందు (Peacock dance) చేసింది.

ఈ అరుదైన దృష్యాలను బాలీవుడ్ టెలివిజన్ నటి మినీ మాథుర్​ తన సెల్​ఫోన్ కెమెరాలో బంధించారు. ఆ దృశ్యాలను మరింత మందికి చూపించేందుకు.. ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. ఇంతటి మనోహరమైన దృశ్యం చూసి నా మనసు పులకరించి పోతుందంటూ అమె చెప్పుకొచ్చారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mini Mathur (@minimathur)

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా.. నెమళ్ల సందడి చూసి వావ్​ అంటున్నారు.

Also read: David warner Video: శ్రీ వల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్​- వీడియో వైరల్​

Also read: Viral Video: బీటీఎస్​ స్టైల్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More