Home> సోషల్
Advertisement

Patna CCTV Video: పట్టపగలు..నడిరోడ్డుపై ఇద్దరిని షూట్ చేసి..తనూ షూట్ చేసుకున్న వ్యక్తి, వీడియో వైరల్

Patna CCTV Video: పట్టపగలే..నడిరోడ్డుమీద..భార్యను చంపేశాడు. కూతుర్ని చంపాడు. తనను తానూ చంపుకున్నాడు. ఇదేదో సినిమా సీన్ కాదు. నిజంగా జరిగిందే. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
 

 Patna CCTV Video: పట్టపగలు..నడిరోడ్డుపై ఇద్దరిని షూట్ చేసి..తనూ షూట్ చేసుకున్న వ్యక్తి, వీడియో వైరల్

Patna CCTV Video: పట్టపగలే..నడిరోడ్డుమీద..భార్యను చంపేశాడు. కూతుర్ని చంపాడు. తనను తానూ చంపుకున్నాడు. ఇదేదో సినిమా సీన్ కాదు. నిజంగా జరిగిందే. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పాట్నాలో జరిగిన ఈ ఘోర ఉదంతం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ దారుణ దృశ్యం పట్టపగలు, ఉదయం సమయంలో..నడిరోడ్డుపై జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను, కూతురిని ట్రిగ్గర్ పాయింట్‌లో పెట్టి కాల్చి..తనూ కాల్చుకుంటాడు. అక్కడే ఉన్న మరో మహిళ నిశ్చేష్టురాలై చూస్తూ షాక్‌కు గురవుతుంది.

ఒళ్లు గగుర్పొడిచే, మనసు చలింపజేసే ఈ వీడియోలో ముగ్గురు మహిళలుంటారు. మరో వ్యక్తి రాజీవ్. రాజీవ్ అనే వ్యక్తి ఈ ముగ్గురిని అడ్డగించి..ముందుగా తన భార్యను, కూతురిని టిగ్గర్ పాయింట్లో గన్ పెట్టి కాలుస్తాడు. ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. మరో మహిళ ఇది చూసి భయపడి షాక్‌కు గురయ్యేలోగా..ఆ వ్యక్తి తనను తాను కాల్చుకుని కుప్పకూలిపోతాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. సంచలనంగా మారింది.

ఈ ఘటన పాట్నాలోని గర్దనీ‌బాఘ్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. నిందితుడి పేరు రాజీవ్. భార్య చనిపోతే..అతని మరదలిని పెళ్లి చేసుకుంటాడు రాజీవ్. అయితే ఆ ఇద్దరి పెళ్లి సజావుగా సాగకపోవడంతో ఇద్దరూ విడిపోతారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకుంటారు. ప్రాధ్యమికంగా దర్యాప్తు ఆధారంగా కుటుంబ కలహాల నేపధ్యంలో ఆ వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 

Also read: Viral Video: హ్యారీ పోటర్ థీమ్ సాంగ్ పాడిన హమ్మింగ్ బర్డ్‌..సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More