Home> సోషల్
Advertisement

One year old baby influencer: వయస్సు ఏడాదే.. కానీ నెలకు రూ. 75 వేలు సంపాదిస్తాడు

One-year-old boy earning Rs 75000 per month: ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడి వయస్సు ఎంతో తెలుసా ? ఈ మధ్యే ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఒక ఏడాది వయస్సున్న పిల్లగాడన్నమాట. మరి ఏడాది వయస్సున్న పిల్లగాడికి ఆదాయం ఏంటి ? ఏం పని చేసి ఆ డబ్బులు సంపాదిస్తాడా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే, ఈ పిల్లాడి గురించి మీకు పూర్తిగా చెప్పాల్సిందే.

One year old baby influencer: వయస్సు ఏడాదే.. కానీ నెలకు రూ. 75 వేలు సంపాదిస్తాడు

One-year-old boy earning Rs 75000 per month: ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడి వయస్సు ఎంతో తెలుసా ? ఈ మధ్యే ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఒక ఏడాది వయస్సున్న పిల్లగాడన్నమాట. మరి ఏడాది వయస్సున్న పిల్లగాడికి ఆదాయం ఏంటి ? ఏం పని చేసి ఆ డబ్బులు సంపాదిస్తాడా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే, ఈ పిల్లాడి గురించి మీకు పూర్తిగా చెప్పాల్సిందే. 

ఈ బాబు పేరు బ్రిగ్స్ డారింగ్టన్ (Briggs Darrington). తల్లిదండ్రుల పేర్లు జెస్, స్టీవ్. అమెరికాలోని ఇడహో ఫాల్స్ బ్రిగ్స్ స్వస్థలం. తల్లిదండ్రులు ఇద్దరూ ట్రావెల్ బ్లాగర్సే (travel blogger parents Jess and Steve) కావడంతో ఈ బుడ్డోడు కూడా ఏడాది వయస్సులోనే సోషల్ మీడియాలో బేబీ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. బ్రిగ్స్‌కి స్పాన్సర్‌షిప్స్ కింద నెలకు 1000 డాలర్ల వరకు వస్తాయి. అంటే భారతీయ కరెన్సీలో నెలకు రూ. 75 వేల ఆదాయంతో సమానం. 

డాలర్లే కాకుండా బ్రిగ్స్‌కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తాయి. అందుకు బ్రిగ్స్ చేయాల్సిందల్లా ఒక్కటే... తల్లిదండ్రుల చంకనెక్కి ఏంచక్కా వాళ్లతో కలిసి ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చుట్టేసి రావడమే. అవును, బ్రిగ్స్ పేరు వాడుకుని తమ బ్రాండ్స్‌కి (Tourism brands) ప్రమోషన్ చేసుకోవాలని భావించే సంస్థలే అతడికి ఈ స్పాన్సర్‌షిప్ అందిస్తున్నాయి. పర్యాటక రంగంలో టూరిజం బిజినెస్ చేసే సంస్థలే బ్రిగ్స్‌కి రెగ్యులర్ క్లయింట్స్.     

Also read : Xiaomi Redmi Note 11 Pro specs: షావోమి నుంచి రెడ్‌మి నోట్ 11 ప్రో మొబైల్ వచ్చేస్తోంది

అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ?
బ్రిగ్స్ పుట్టడానికి ముందు తల్లి జెస్ ప్రెగ్నెంట్ అయినప్పుడే చాలా భయపడిందట. బ్రిగ్స్ బాగోగులు చూసుకుంటూ తాను కొంత కాలం పాటు ఉపాధి కోల్పోవాల్సిందేనా ? లేదంటే ఇంతటితో తన కెరీర్ ముగిసిపోతుందా అనే ఆందోళనకు గురైన బ్రిగ్స్ తల్లి జెస్ మెదడులో ఓ ఐడియా మెరిసింది. అదేంటంటే.. చిన్న పిల్లలు ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా ఎవరైనా ఉన్నారా అని. అలా ఆలోచన వచ్చిన మరుక్షణమే జెస్ సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. అక్కడ ఆమెకు ఒక్కటంటే ఒక్క అకౌంట్ కూడా కనిపించలేదు. అప్పుడే జెస్ డిసైడ్ అయింది ఏంటంటే.. తన కొడుకు బ్రిగ్స్‌ని బేబీ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మార్చేయాలని. 

అమెరికాలో దాదాపు 16 రాష్ట్రాల్లోని టూరిస్ట్ స్పాట్స్‌ని చుట్టొచ్చిన బ్రిగ్స్‌కి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న పిల్లలతో కలిసి టూరిస్ట్ స్పాట్స్‌కి (Tourism tips) వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడికి ఎలా వెళ్లాలి అనే డీటేల్స్ ఇవ్వడమే జెస్, స్టీవ్ మెయిన్ జాబ్. అదండీ నెలకు రూ.75 వేలు వరకు సంపాదిస్తున్న బ్రిగ్స్ వైరల్ స్టోరీ (Viral news).

Also read : Driverless Bike Video: డ్రైవర్​లెస్​ కారు చూశారు.. మరి డ్రైవర్​లెస్​ బైక్​ చూశారా?

Also read : Chimpanzee washing clothes: బట్టలు ఉతుక్కుంటున్న చింపాంజీ.. Viral video

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More