Home> సోషల్
Advertisement

లోకల్ ట్రైన్‌లో పర్సు చోరీ.. ఏకంగా 14ఏళ్ల తర్వాత దొరికింది

అతడు చాలా లక్కీ. లేకపోతే రైల్లో పోగొట్టుకున్న పర్సు దొరకడమేంటి. అది కూడా ఏకంగా 14 ఏళ్ల తర్వాత పోలీసులు (Wallet Recovered after 14 years) ఫోన్ చేసి పిలిచి మరీ తాను పొగొట్టుకున్న పర్సును ఇచ్చేసరికి ముంబై వ్యక్తి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

లోకల్ ట్రైన్‌లో పర్సు చోరీ.. ఏకంగా 14ఏళ్ల తర్వాత దొరికింది

సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు పర్సు (Wallet) పోయిందంటే ఎవరో చోరీ చేసింటారు. ఇక లాభం లేదనుకుంటాం. కానీ అనూహ్యంగా ఓ వ్యక్తి తాను పోగొట్టుకున్న పర్సు ఒకటి, రెండు కాదు ఏకంగా 14 ఏళ్ల తర్వాత (Stolen Wallet Recovered after 14 years) దొరికింది. అది కూడా ఎంత నగదు పోయిందో అంత మొత్తం పర్సులోనే ఉండటం గమనార్హం. ఐపీఎల్‌లో ఎప్పటికీ నేనింతే: Virat Kohli

ఆ వివరాలిలా ఉన్నాయి.. హేమంత్ పడాల్కర్ అనే వ్యక్తి 2006లో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ తన పర్సు పోగొట్టుకున్నాడు. రైల్వే పోలీసులకు వెళ్లి తన పర్సు చోరీ చేశారని, అందులో రూ.900 ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. పర్సు దొరకడం కష్టమని పోలీసులు చెప్పారు. దొరకడం కష్టమన్నారు. 14 ఏళ్ల తర్వాత ముంబై పోలీసుల నుంచి హేమంత్‌కు ఫోన్ కాల్ వచ్చింది. మీ పర్సు దొరికింది వచ్చి తీసుకెళ్లండని చెప్పేసరికి షాక్ అయ్యాడు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు 

వెళ్లి చూస్తే ఆ పర్సు తనదే. రద్దయిన రూ.500 నోటును పోలీసులు తీసుకున్నారు. మిగతా నగదులో రూ.300 హేమంత్‌కు ఇచ్చారు, రద్దయిన నోటును మార్పించి అకౌంట్‌లో జమచేస్తామని పోలీసులు చెప్పారు. మరో రూ.100 స్టాంప్ పేపర్ వర్క్ కోసం తీసుకున్నారు. ఓ దొంగను అరెస్ట్ చేయగా ఈ పర్సు దొరికినట్లు పోలీసులు తెలిపారు. 
హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

Read More