Home> సోషల్
Advertisement

Microsoft: చైనాకు షాక్, లింక్డ్‌ఇన్ సేవల్ని నిలిపివేసిన మైక్రోసాఫ్ట్

Microsoft: ప్రముఖ అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్..చైనా దేశానికి షాక్ ఇచ్చింది. లింక్డ్‌ఇన్ కెరీర్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. చైనీయుల ప్రొఫైల్స్‌ను బ్లాక్ చేసింది. మైక్రోసాఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణమేంటి.
 

Microsoft: చైనాకు షాక్, లింక్డ్‌ఇన్ సేవల్ని నిలిపివేసిన మైక్రోసాఫ్ట్

Microsoft: ప్రముఖ అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్..చైనా దేశానికి షాక్ ఇచ్చింది. లింక్డ్‌ఇన్ కెరీర్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. చైనీయుల ప్రొఫైల్స్‌ను బ్లాక్ చేసింది. మైక్రోసాఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణమేంటి.

చైనాలో గత కొద్దిరోజులుగా దిగ్గజ కంపెనీలపై ఆ దేశ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. వివిధ రకాల చట్టాల్ని ప్రవేశపెట్టి కంపెనీల్ని భయపెడుతోంది. ముఖ్యంగా అమెరికన్ కంపెనీల్ని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనా నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అటు స్వదేశీ కంపెనీలపై కూడా ఇదే వైఖరి అవలంభిస్తోంది. ఫలితంగా దిగ్గజ కంపెనీలు కొన్ని చైనాలో సేవల్ని నిలిపివేసేందుకు నిర్ణయించుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే ప్రముఖ అమెరికన్ కంపెనీ మైక్రోసాఫ్ట్..చైనాకు(China) షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన లింక్డ్‌ఇన్(Linkedin)కెరీర్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను చైనాలో మూసివేస్తున్నట్టుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది. చైనా చట్టాలకు కట్టుబడి పనిచేయడం సవాలుగా మారిందని..అందుకే లింక్డ్‌ఇన్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇప్పటికే చైనా జర్నలిస్టుల ప్రొఫైల్స్ బ్లాక్ చేసింది. ఈ వ్యవహారంపై చైనా ప్రభుత్వం..మైక్రోసాఫ్ట్‌ను ప్రశ్నించింది కూడా. అయితే లింక్డ్‌ఇన్ సేవల్ని నిలిపివేసినా..చైనా మార్కెట్ వదిలి వెళ్లేందుకు మాత్రం మైక్రోసాఫ్ట్ సిద్ఘంగా లేదు. లింక్డ్‌ఇన్ స్థానంలో త్వరలో ఇన్‌జాబ్స్‌ను మైక్రోసాఫ్ట్(Microsoft) ప్రవేశపెట్టబోతోంది. కానీ లింక్డ్‌ఇన్‌లో ఉన్నట్టుగా ఇన్‌జాబ్స్‌లో యూజర్లు అభిప్రాయాల్ని షేర్ చేసుకోలేరు. అమెరికన్ కంపెనీలపై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని లింక్డ్‌ఇన్ ఆరోపించింది.

Also read: Kerala Heavy Rains: కేరళలో భారీ వర్షాలు, కొట్టుకుపోతున్న ఇళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More