Home> సోషల్
Advertisement

Internet Explorer: త్వరలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలు బంద్, రిటైర్ కానున్న బ్రౌజర్

Microsoft Internet Explorer: కేవలం తమ ఫోన్లలో, పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్ డెస్క్‌టాప్‌ల మీద కనిపించే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సుమారు పాతికేళ్లుగా నెటిజన్లకు సేవలు అందించింది. కానీ త్వరలో ఇది కనుమరుగు కానుంది. ఈ బ్రౌజర్ విండోస్ 10 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో తుది సేవలు పూర్తి చేసుకోనుంది.

Internet Explorer: త్వరలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలు బంద్, రిటైర్ కానున్న బ్రౌజర్

ఇప్పటి జనరేషన్‌కు అంతగా తెలియని బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. కేవలం తమ ఫోన్లలో, పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్ డెస్క్‌టాప్‌ల మీద కనిపించే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సుమారు పాతికేళ్లుగా నెటిజన్లకు సేవలు అందించింది. కానీ త్వరలో ఇది కనుమరుగు కానుంది. ఈ జూన్ 15 నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌(Internet Explorer)ను నిలిపివేయనున్నామని మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ప్రకటించింది.

1990 దశకంలో విండోస్ 95తో మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చింది. అప్పటినుంచి నెటిజన్లకు సేవలు అందించిన ఈ బ్రౌజర్ విండోస్ 10 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో తుది సేవలు పూర్తి చేసుకోనుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్ మేనేజర్ సీన్ లిండర్సే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (Internet Explorer) 11 డెస్క్‌టాప్ అప్లికేషన్ 15 జూన్ 2021న సేవలకు తుది వీడ్కోలు పలుకుందన్నారు. అదే విధంగా విండోస్ 10లో కొన్ని వెర్షన్లలో దీని సేవలు ఆరోజు నుంచి అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. 

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యకు 8వ వేతన సంఘం చెక్ పెడుతుందా

రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ సేవలను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో వినియోగించుకుంటాం. బ్రౌజింగ్ సేవలకు ఏ అంతరాయం లేకుండా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వినియోగంలోకి రానుందని పేర్కొన్నారు. వినియోగదారులకు సంబంధించిన వెర్షన్లు కచ్చితంగా వాడుకలో ఉండవని తేలిపోయింది. క్లయింట్స్‌ ఇకనుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సర్వీసులు వినియోగించుకోలేరు. కొన్ని ప్రత్యేకమైన సర్వీసులు మాత్రమే జూన్ గడువు ముగిసిన తరువాత సైతం అందుబాటులో ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, మళ్లీ క్షీణించిన వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More