Home> సోషల్
Advertisement

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!

Megastar Chiranjeevi Leaks a Video:  మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నంలోని వాల్తేరు ప్రాంత నేపథ్యంలో రూపొందిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలోనటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!

Megastar Chiranjeevi Leaks a Video From Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. విశాఖపట్నంలోని వాల్తేరు ప్రాంత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ బయటకు వదిలారు చిరంజీవి.

వాస్తవానికి అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను పలు సందర్భాలలో మెగాస్టార్ చిరంజీవి లీక్ చేస్తారన్న పేరు ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు వాల్తేరు వీరయ్య లోని పాటకు సంబంధించిన చిన్న వీడియో ఒకదాన్ని కావాలనే ప్రమోషన్స్ కోసం లిక్ చేయించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట షూటింగ్ చేయడం కోసం యూనిట్ అంతా కలిసి ఫ్రాన్స్ వెళ్ళింది, ఈ క్రమంలో అక్కడి మంచు అందాలను చూసి ముగ్ధుడైన చిరంజీవి అప్పటికప్పుడు ఒక వీడియో షూట్ చేసి తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తాను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నానని ఈనెల 12వ తేదీన శృతిహాసన్తో చేస్తున్న సాంగ్ పూర్తయిందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఈ సాంగ్ విజువల్స్ తో చాలా అద్భుతంగా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మేము షూట్ చేసిన లొకేషన్స్ చాలా బాగున్నాయని సౌత్ ఫాన్స్ లోని లేజే అనే ప్రాంతంలో షూటింగ్ జరిపామని పేర్కొన్నారు.

ఇదంతా లోయల్లో ఉంటుందని మంచుతో కప్పుబడిన తర్వాత ఆ లోయ అందాలు మాటల్లో చెప్పలేము అని చెప్పుకొచ్చారు. మైనస్ 8 డిగ్రీల చలిలో స్ట్రాంగ్ స్టెప్స్ వేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందని, అందుకే సాంగ్ షూట్ చేయడానికి సినిమా యూనిట్ చాలా కష్టపడింది అని చిరు చెప్పుకొచ్చారు. ఏమైనా మిమ్మల్ని అలరించడానికి ఇవేవీ నాకు పెద్దగా కష్టంగా అనిపించలేదు అని పేర్కొన్నారు. ఇక కేవలం సాంగ్స్ షూటింగ్ తప్ప మిగతా టాకీ పార్ట్ అంతా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.  ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన సినిమా యూనిట్ మరో పక్క ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాస్ పార్టీ అనే సాంగ్ విడుదలై మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. 

Also Read: Manchu Lakshmi: మంచో చెడో పవన్ పక్కనుంటే బాగుందన్న మంచు లక్ష్మీ.. దారుణంగా ఆడుకుంటున్న ఫాన్స్!

Also Read: Pathan New Controversy: మరో వివాదంలో చిక్కుకున్న పఠాన్.. ఆ బట్టలతో సినిమా రిలీజ్ అవ్వనివ్వం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
Read More