Home> సోషల్
Advertisement

550 Birthday cakes video: ఒకేసారి 550 బర్త్‌డే కేకులు కట్ చేసిన యువకుడు

550 Birthday cakes viral video: వీడియోలో బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న వ్యక్తి పేరు సౌర్య రాటూరి. తన పుట్టిన రోజు సందర్భంగా 550 కేక్స్ కట్‌ చేసి (550 cakes cutting video) చుట్టూ ఉన్న వారికి, చూసే వారిని ముక్కున వేలేసుకునేలా చేశాడు. వరుసగా వేసిన టేబుల్స్‌పై కేకులను వరుసగా పేర్చి వాటిని కట్‌ చేసుకుంటూ వెళ్లాడు. 

550 Birthday cakes video: ఒకేసారి 550 బర్త్‌డే కేకులు కట్ చేసిన యువకుడు

550 Birthday cakes video: ముంబై: పుట్టిన రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలి అనే కోరిక చాలా మందికే ఉంటుంది. బాగా డబ్బున్న వారికి ఈ కోరిక ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. బర్త్ డే సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలన్న కోరికకు ఇంకాస్త వెరైటీ పిచ్చి కూడా తోడయితే ఇంకేమైనా ఉందా ? వాళ్లు చేసే హడావుడి, ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు సరికదా.. చూసేవాళ్లలో కొంత మందికి ఔరా అనిపిస్తే.. చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి ముంబైలో చోటుచేసుకుంది. ఒక యువకుడు తన బర్త్ డే వేడుక కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 550 కేకులు కట్‌ చేసి ఔరా అనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియోలో బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న వ్యక్తి పేరు సూర్య రాటూరి. తన పుట్టిన రోజు సందర్భంగా 550 కేక్స్ కట్‌ చేసి (550 cakes cutting video) చుట్టూ ఉన్న వారికి, చూసే వారిని ముక్కున వేలేసుకునేలా చేశాడు. వరుసగా వేసిన టేబుల్స్‌పై కేకులను వరుసగా పేర్చి వాటిని కట్‌ చేసుకుంటూ వెళ్లాడు. 

సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ మాత్రం సౌర్యపై విరుచుకుపడుతున్నారు. అన్ని కేకుల కోసం అనవసరంగా డబ్బులు తగలేసే బదులు.. తినడానికి తిండి లేని నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది కదా అని మండిపడుతున్నారు. ఇంకొంత మంది ఏకంగా బూతులతో విరుచుకుపడుతున్నారు అది వేరే విషయం. 

ఏదేమైనా.. నిరుపేదల ఆకలి తీర్చడానికి ఆ డబ్బు వినియోగించి ఉండి ఉంటే బాగుండేది కదా అంటున్న నెటిజెన్స్ (trolls on 550 birthday cakes video) ఆగ్రహంలో అర్థం లేకపోలేదని అనిపిస్తోంది కదూ!!

Read More