Home> సోషల్
Advertisement

Lion Man Viral Video: ఐదు పెగ్గులు వేస్తే.. సింహంతో కూడా ఆటాడుకోవచ్చు! నమ్ముకుంటే ఈ వీడియో చూడండి

Funny Viral Video, Drunk Man Playing with Big Lion. అడవి రాజు సింహంతో ఓ వ్యక్తి ఆడుకోవడం ఎపుడైనా చూసారా?. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Lion Man Viral Video: ఐదు పెగ్గులు వేస్తే.. సింహంతో కూడా ఆటాడుకోవచ్చు! నమ్ముకుంటే ఈ వీడియో చూడండి

Funny Lion Man Viral Video, Drunk Man Playing with Big Lion with Chicken: 'ఆల్కహాల్' ప్రతి ఒక్కరిపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది. పూటుగా మద్యం సేవించిన వ్యక్తులు ఎంతో దైర్యంగా ఉంటారు. గతంలో చేయని రకరకాల ఉల్లాసమైన కార్యకలాపాలు చేయడమే కాకుండా ఊహించని విన్యాసాలు కూడా చేస్తారు. మద్యం సేవించిన వ్యక్తులు డాన్స్ చేయడం లేదా గొడవ పడడం లాంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే అడవి రాజు, కూరమృగం సింహంతో ఆడుకోవడం ఎపుడైనా చూసారా?. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... పూటుగా తాగిన ఓ వ్యక్తి రాత్రి పూట ఆరు బయట కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. ఓ లైట్ వెలుగుతుండగా వ్యక్తి దర్జాగా కాలుమీద కేలేసుకుని కూర్చుంటాడు. అతడి పక్కనే ఓ కోడి ఉంటుంది. అదే సమయంలో ఓ పెద్ద సింహం అక్కడికి వస్తుంది. కోడిని చేతిలో పట్టుకుని ఆ సింహంకి చూపిస్తాడు. దాంతో అది కోడిని తినేందుకు ముందుకు వస్తుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో సింహంతో ఆటాడుకుంటాడు. కోడిని దానికి అందకుండా దాస్తుంటాడు. ఇలా కాసేపు దానితో ఆడుకుంటాడు. 

కోడిని తినాలనే పట్టుదలో ఉన్న ఆ సింహం మాత్రం అతడిని ఏమి అనదు. చివరకు పూటుగా తాకిన ఆ వ్యక్తి ఓసారి ఏమరపాటుగా ఉన్న సమయంలో సింహం కోడిని అందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ వీడియోను 'లాజికల్ థింకర్' అనే ట్విటర్ యూసర్ నెట్టింట పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన 20 సెకన్ల వీడియోకి 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. '5 పెగ్‌లు తాగిన తర్వాత ఈ ధైర్యం అదే వస్తుంది' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ విదేయుకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన అందరూ ఆ వ్యక్తి ధైర్యం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Babar Azam Private Video: సహచర క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్, న్యూడ్‌ వీడియో కాల్.. బాబర్‌ ఆజమ్‌ తాజా పోస్ట్ వైరల్!  

Also Read: Baleno Second Hand Cars: 4.5 లక్షలకే మారుతీ సుజుకి బాలెనో.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More