Home> సోషల్
Advertisement

King Cobra Video: టాయిలెట్‌లో కింగ్ కోబ్రా.. చూసుకోకుండా కూర్చుంటే అంతే సంగతులు (వీడియో)

King Cobra Video: King Cobra appears in toilet. గుజరాత్‌లోని ఓ గ్రామంలోని ఇంట్లో ఉన్న టాయిలెట్‌లోకి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా దూరింది.
 

King Cobra Video: టాయిలెట్‌లో కింగ్ కోబ్రా.. చూసుకోకుండా కూర్చుంటే అంతే సంగతులు (వీడియో)

King Cobra Viral Video, King Cobra HalChal in Toilet: పాముల అన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది 'కింగ్ కోబ్రా'. ఇది విషపూరితమైనదే కాకుండా చాలా పొడవుగా ఉంటుంది. ఇలాంటి పాము మనుషులను కాటేస్తే.. నిమిషాల వ్యవధిలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి ప్రమాదకరమైన పాములు అడవుల్లో తిరుగుతుంటాయి. అప్పుడపుడు ఇళ్లలోకి కూడా వస్తుంటాయి. అయితే ఓ పాము ఏకంగా టాయిలెట్‌లోకి దూరింది. ఎంత ప్రయతించినా అందులోంచి రాలేదు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అయింది. 

గుజరాత్‌లోని ఓ గ్రామంలోని ఇంట్లో ఉన్న టాయిలెట్‌లోకి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా దూరింది. ఆ ఇంటి యజమాని టాయిలెట్‌ కోసమని వెళ్లగా.. పొడవైన కింగ్ కోబ్రా కనిపించింది. దాంతో యజమాని భయబ్రాంతులతో బయటికి పరుగెత్తుకొచ్చాడు. ఆపై ఇంటి యజమాని కాస్త ధైర్యం చేసి.. టాయిలెట్ డోర్ మూసేశాడు. ఆ వెంటనే స్నాక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ వెంటనే ఇంటికి వచ్చారు. 

కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు రెస్క్యూ టీమ్‌ ఎంత ప్రయత్నించినా అది చిక్కలేదు. ఒక్కోసారి అది టాయిలెట్‌ కుండీలోకి పూర్తిగా వెళ్ళిపోయింది. చాలాసేపు రెస్క్యూ టీమ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన కింగ్ కోబ్రా.. చివరికి చిక్కింది. రెస్క్యూ టీమ్‌ దాన్ని బందించి ఓ డబ్బాలో వేశారు. 'సర్ప్మిత్ర ఆకాష్ జాదవ్' అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ  వీడియో అందుబాటులో ఉంది. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు 17 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగ కామెంట్లు చేస్తున్నారు. 'చూసుకోకుండా కూర్చుంటే అంతే సంగతులు' అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: బీసీసీఐ ఏం చేస్తుందో అర్ధం కావట్లేదు.. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తే ఫామ్‌లోకి వస్తాడా: మాజీ సెలెక్టర్  

Also Read: Flipkart Offers: ఈ బ్రాండ్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.21 వేలు.. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4999కే..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More