Home> సోషల్
Advertisement

Arogya Setu App: ఆరోగ్యసేతు యాప్ ఎలా డౌన్ లోడ్ చేయాలి ? వివరాలు ఎలా పొందుపరచాలి ?

మీ మొబైల్ లో యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ ఉంటే ఆరోగ్య సేతు యాప్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 

Arogya Setu App: ఆరోగ్యసేతు యాప్ ఎలా డౌన్ లోడ్ చేయాలి ? వివరాలు ఎలా పొందుపరచాలి ?

కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ లాంచ్ ( Arogya Setu ) చేసింది. ఈ యాప్ లాంచ్ చేసి చాలా కాలం అయినా.. చాలా మంది ఇప్పటికీ దీనికి డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న లోకేషన్ ( Arogya Setu Uses Location and Bluetooth ) అండ్ బ్లూ టూత్ ఫీచర్స్ ను వినయోగించి మీరు హైరిస్కు జోన్ లో ఉన్నారా.. కోవిడ్-19 ( Covid-19 ) సోకిన వ్యక్తికి సమీపంలో మీరు వెళ్లారా అని తెలియజేస్తుంది.  

మీ మొబైల్ లో యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ ఉంటే ఆరోగ్య సేతు యాప్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆరోగ్య సేతు యాప్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి..

1. యాండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ ప్లే స్టోర్  లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
2. ఇన్ స్టాల్ చేసుకున్నా.. యాప్ ను తెరిచి భాషను ఎంచుకోండి.
3. స్ర్కీన్ పై వచ్చే సమాచారం చదివి.. పర్మిషన్స్ అడిగితే అంగీకరించండి. 

4.  లోకేషన్ ను ఎప్పడూ ఆన్ ఉంచండి.  బ్లూ టూత్ ఎప్పుడూ ఆన్ లో ఉంచండి. 
5. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక.. ఓటీపి వివరాలు ఎంటర్ చేయండి. 
6. ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి. అంటే మీ జెండర్, పూర్తి పేరు, వయసు, ప్రోఫెషన్.. మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాత మీ ఆరోగ్యం గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. వీటిని తరువాత కూడా ఎంటర్ చేయవచ్చు.
7.వ్యక్తిగత భద్రతతో పాటు పీఎం కేర్స్ ఎకౌంట్ వివరాలు కూడా అందిస్తారు. మీరు డొనేట్ కూడా , చేయవచ్చు.

ఒకవేళ మీరు హైరిస్కులో ఉన్నా.. హైరిస్కు ఏరియాలో ఉన్నా.. మీరు వెంటనే 1075 అనే టోల్ ఫ్రీనెంబర్ కు కాల్ చేయండి.

 

Read More