Home> సోషల్
Advertisement

Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?

Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో  పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
 

Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?

Snake eat fish viral video: ఆంధ్ర ప్రదేశ్ లో వరదల కొన్నిరోజులుగా  ప్రజల్ని ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో విజయవాడకు వరద పొటెత్తింది. అంతేకాకుండా.. విజయవాడలోని.. ఎక్కడ చూసిన  కూడా అపార్ట్ మెంట్లు, రోడ్ల మీదకు ఇళ్లలోనికి ప్రవేశించాయి.  అంతే కాకుండా.. ఏకంగా సీఎం చంద్రబాబు పదిరోజుల పాటు విజయవాడలో ఉండి మరీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

మరోవైపు.. ఏపీలో వరదల్లో చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పాములు,మొసళ్లు సైతం.. ఇండ్లలోనికి వచ్చేస్తున్నాయి.  దీంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.ఈ క్రమంలో.. ఏలూరు గ్రామీణ మండలం.. ప్రత్తికోళ్ల లంక వరద ప్రభావిత గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు.. 

ఏలూరు గ్రామీణ మండలం.. ప్రత్తికోళ్ల లంక వరద ప్రభావిత ప్రాంతంలో వరదలు పొటెత్తాయి. ఎక్కడ చూసిన కూడా కొల్లేరు సరస్సు పొంగిపొర్లటం వల్ల.. అనేక గ్రామాల్లో వరద నీళ్లు వచ్చిచేరిపోయాయి. ఈ క్రమంలో వరదల్లో రోడ్డు మీద ఒక అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక పాము వరదల్లో రోడ్డు మీదకు వచ్చిన.. చేపల్ని మింగేందుకు పాము ప్రయత్నించింది.

అంతేకాకుండా.. ఒక చేపను సైతం నోట్లో పెట్టుకుంది.  అది చేపలను మింగేందుకు ప్రయత్నించింది. కానీ ఇంతలో అక్కడున్న వారు.. పామును కర్రలతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. దీంతో పాము.. నోట్లో చెప అలానే ఉండిపోయింది. ఈ ఘటనను అక్కడున్న వారు.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.  

Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..

మరోవైపు ఏపీలో ప్రజల్ని ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు.. అన్నిరకాల చర్యల్ని చేపట్టింది. వదరలో జరిగిన నష్టంపై సీఎం సర్కారు పూర్తి స్థాయిలో నివేదికను కేంద్రం ముందర ఉంచడానికి కసరత్తులు చేపట్టింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More