Home> సోషల్
Advertisement

Heartbroken Viral Video: ప్రతీ ఒక్కరూ చూడాల్సిన వీడియో.. ఓ అవ్వా.. నీ అత్మాభిమానం గొప్పదమ్మా

Heartbroken Viral Video: ఇంటర్నెట్​లో ఓ ముసలవ్వ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దయనీయ స్థతిలోను ఆమె ఆత్మాభిమానం చూసిన నెటిజన్లు ఏమోషనల్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

Heartbroken Viral Video: ప్రతీ ఒక్కరూ చూడాల్సిన వీడియో.. ఓ అవ్వా.. నీ అత్మాభిమానం గొప్పదమ్మా

Heartbroken Viral Video: సోషల్ మీడియా అంటే ఎప్పుడూ పన్నీ వైరల్ వీడియోలు.. యాక్సిడెంట్లు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మనిషికి గొప్ప పాఠాలు నేర్పించే వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​లో వైరల్ అవుతోంది.

ghantaa అనే ఇన్​స్టా పేజీలో రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఓ వీడియో చూసి చాలా మంది భావోద్వేగానికి లోనవుతున్నారు. మరికొందరు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1.48 లక్షల మందికిపైగా లైక్​ చేశారు. వేలాది మంది కామెంట్స్​ చేశారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముదంటే..

రోడ్డు పక్కల ఓ ముసలవ్వ కూర్చుని ఉంది. అమె అత్యంత దయనీయ  స్థితిలో అక్కడ ఉంది. అయితే ఓ అజ్ఞాత వ్యక్తి.. ఆ అవ్వ దీన స్థితిని చూసి.. అమె దగ్గరకు వెళ్లి ఓ వాటర్ బాటిల్​ ఇచ్చారు. ఆ అవ్వ కూడా దానిని ఎంతో సంతోషంగా తీసుకుంది. ఆ అజ్ఞాత వ్యక్తి అమెకు ఫుడ్​ ఫుడ్​ ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ఆ ముసలవ్వ దానిని కూడా సంతోషంగా తీసుకుంది.

వాటర్ బాటిల్​, ఆహారం ఇచ్చిన వ్యక్తిని చూస్తూ.. ఆ ముసలవ్వ ఎంతో సంతోషంతో రెండు చేతులెత్తి నమస్కరించింది.

ఇక్కడితో అంతా అయిపోలేదు.. ఆ వ్యక్తి సహాయాన్నీ ఆ ముసలవ్వ ఊరికే తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఆ సహాయం చేసిన వ్యక్తికి తన చీర కొంగు చివరన కట్టుకున్న కొంత డబ్బును తీసి ఆ వ్యక్తికి ఇవ్వబోయింది. అయితే ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం వాటిని తీసుకోలేదు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by memes | comedy (@ghantaa)

ఈ వయసులోనూ అంత దయనీయ స్థితిలోనూ ఆమె ఆత్మాభిమానం చూసి నెటిజన్లు.. ఆ అవ్వపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ముసలవ్వకు ఎలాంటి ప్రతి ఫలం ఆశించకుండా సహాయం చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని ఆకాశానికెత్తేస్తున్నారు నెటిజన్లు. స్వార్ధంతో నిండిన ఈ సమాజంలో అప్పుడప్పుడులు ఇలాంటి సంఘటనలు మనుషుల్లో మానవత్వాన్ని కదిలిస్తుంటాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

Also read: Viral Videos: పెళ్లి రిసెప్షన్​కు కుటుంబంతో హాజరైన ఎలుగుబంటి.. వీడియో వైరల్​!

Also read: Pushpa Srivalli Dance: ఈ తల్లీ బిడ్డల డాన్స్ చూస్తే.. అల్లు అర్జున్ కూడా ఫిదా అవ్వాల్సిందే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More