Home> సోషల్
Advertisement

Headless Snake Video: వారెవ్వా.. తల తెగి పడిన.. వ్యక్తిపై దాడి చేస్తున్న పాము.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్న జనం

Headless Snake Attacks on Men Video got Viral : సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో ఎన్నో వీడియోలు కామన్ గా అనిపించేవే కానీ కొన్ని వీడియోలు మాత్రం మన కళ్లను మనమే నమ్మలేం అనేట్టుగా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూసినా మనం ఏం చూసేది నిజమేనా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది కూడా.

Headless Snake Video: వారెవ్వా.. తల తెగి పడిన.. వ్యక్తిపై దాడి చేస్తున్న పాము.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్న జనం

Headless Snake Attacks on Men: తల తెగిన పాము పగపడుతుందా ? తల తెగిన పామును ఎవరైనా ఏమైనా అంటే అది వారిపైకి తిరిగి ప్రతిఘటిస్తుందా ? తల తెగిన పాము ఎంతసేపు బతికుంటుంది ? తల తెగిన పాముకు బ్రెయిన్ సెన్స్ ఎలా పనిచేస్తుంది ? తల తెగిన వెంటనే పాముకు ప్రాణం పోదా ? ఈ వీడియో చూసిన వాళ్లకు చాలామందికి కలుగుతున్న అనేక సందేహాలు ఇవి. అందుకు కారణం తల లేకుండానే ఒక పాము తన తోకను పట్టుకున్న వ్యక్తిని దాదాపు కాటు వేసినంత వేగంగా తల ఉన్న భాగాన్ని తిప్పి కొట్టింది. అది చూసి ఆ వ్యక్తి కూడా జడుసుకుని వెనక్కి జరిగాడు అంటే ఆ పాము ఎంత వైల్డ్ గా రియాక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. 

అందుకే ఈ వీడియో చూసిన వాళ్లందరికీ రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఏ జీవికైనా తల తెగితే వెంటనే ప్రాణం పోతుంది. మహా అయితే కొన్ని క్షణాల పాటు కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలేస్తుంది. తల తెగిన జీవికి మెదడు ఉండదు కనుక అది ఎప్పటిలా రియాక్ట్ అయ్యే గుణాన్ని కూడా కోల్పోతుంది. కానీ ఈ వీడియోలో చూస్తున్న పాము మాత్రం తోక తొక్కిన తాచులా తన తోకను పట్టుకున్న వ్యక్తిపై లేవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఇది కూడా చదవండి : Road Accident Viral Video: వర్షంలో స్కిడ్ అయిన బైక్.. వెనకాలే వేగంగా వచ్చిన ట్రక్కు.. ఏం జరిగిందో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు

ఈ వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తి పేర్కొన్న వివరాల ప్రకారం ఆ పాముకు తల తెగి అప్పటికే 5 గంటలు అవుతోంది. తన స్నేహితుడి ఇంట్లో పిల్లలు ఉయ్యాల ఊగే చోట ఉన్న పామును అతడు తలపై కొట్టాడని.. ఆ తరువాత ఆ పామును తాను ఇంట్లోకి తీసుకొచ్చానని ఆ వ్యక్తి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి చెప్పింది నిజమేనా ? పాముకే కాదు.. ఏ జీవికైనా తల తెగిపడ్డాకా  5 గంటల సేపు జీవం ఉంటుందా ? ఇవి ఈ వీడియో చూసిన నెటిజెన్స్ వ్యక్తంచేస్తున్న సందేహాలు. ఏదేమైనా రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజెన్స్ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Monkey Funny Video: వీడియో కోసం కోతికి అన్నం పెట్టింది.. ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More