Home> సోషల్
Advertisement

Groom Kissed Video: మండపంలో అందరిముందే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. సిగ్గుతో ఏం చేశాడో చూడండి!

Viral Video, Groom kisses Bride infront of relatives. వధువు బుగ్గపై ముద్దుపెట్టిన అనంతరం వరుడు సిగ్గుతో తల దాచుకుంటాడు. 
 

Groom Kissed Video: మండపంలో అందరిముందే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. సిగ్గుతో ఏం చేశాడో చూడండి!

Indian Groom kisses Bride infront of Family members: పెళ్లికి ముందు వధువు, వరుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఉన్నా.. లేకున్నా పెళ్లి మండ‌పంలో తప్ప‌నిస‌రిగా ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ సైలెంట్‌గా ఉంటారు. వధూవరులకు ఎంత ప‌రిచ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. పెళ్లి పూర్త‌య్యే వ‌ర‌కు ఎవరో తెలియన‌ట్టుగానే ఉంటారు. కొన్ని పెళ్లిళ్ల‌లో వారి ఆచారాల ప్రకారం వధూవరులు మండపంలోనే ముద్దు పెట్టుకుంటారు. హిందూ వివాహాల్లో మాత్రం ఇలాంటి ఉండవు. క‌నీసం ముట్టుకోవ‌డానికి కూడా అనుమ‌తించ‌రు. అయితే ఓ పెళ్లిలో వ‌రుడు అంత‌కు మించి అనేలా చేశాడు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బంధువుల సమక్షంలో వధూవరుల పెళ్లి జరుగుతుంది. తాళి కట్టిన అనంతరం వధువుకు వరుడు సిందూరం పెట్టే సమయం వచ్చింది. ఓవైపు పురోహితుడు మంత్రాలు చదువుతుండగా.. బంధువులు వధువు పాపిడ బిళ్లను పట్టుకుంటారు. వరుడు చేతిలో సిందూరం తీసుకుని వధువు నుదిటిపై దిద్దుతాడు. ఆపై అందరూ చూస్తుండగానే వధువు బుగ్గపై ముద్దుపెడుతాడు. 

వధువు బుగ్గపై ముద్దుపెట్టిన అనంతరం వరుడు సిగ్గుతో తల దాచుకుంటాడు. పక్కకు తిరిగి నవ్వుకుంటాడు. ఈ ఘటనను ఊహించని వధువు ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. ఇక మండపంలో ఉన్న మహిళలు అయితే ఆశ్చర్యంగా చూసి నవ్వులు పూయిస్తారు. చివరికి పెళ్లి మండపం మొత్తం నవ్వులతో విరాజిల్లుతుంది. మండపం ముందున్న వారు కూడా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. 

ఇందుకు సంబందించిన వీడియోను 'వెడ్డింగ్ వరల్డ్ పేజ్' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఆంటీస్ రియాక్షన్ చూడండి అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ రాగా.. వేలల్లో లైకులు వచ్చాయి. ఇక ఆలస్యం ఎందుకు మీరు వీడియో చూసి నవ్వుకోండి. 

Also Read: Pooja Hegde Pics: పండ్ల తోటలో పూజా హెగ్డే.. స్ట్రాబెర్రీలు, చెర్రీలను కోస్తూ కూడా అందాల ట్రీట్!

Also Read: Kohli-Babar: బాబర్‌ ఆజమ్‌ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన విరాట్ కోహ్లీ.. 'నువ్వు ఇలాగే' అంటూ..!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More