Home> సోషల్
Advertisement

OMG Video: సఫారీ జీప్ పైకి దూసుకొచ్చిన ఏనుగు, రెప్పపాటులో తప్పించుకున్న టూరిస్టులు..

Viral Video Today: సోషల్ మీడియాలో ఈ మధ్య యానిమల్స్ కు  సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 
 

OMG Video: సఫారీ జీప్ పైకి దూసుకొచ్చిన ఏనుగు, రెప్పపాటులో తప్పించుకున్న టూరిస్టులు..

Viral Video Today: అడవులు.. ఎన్నో వృక్షాలు, వేలాది జంతువులకు ఆవాసాలు. అలాంటి అడవులను మనిషి తన స్వార్థం కోసం ఇష్టారీతిగా నరికేస్తున్నాడు. దాంతో జంతువుల మునగుడకు ముప్పువాటిల్లుతుంది. తద్వారా యానిమల్స్ జనావాసాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి, లేదంటే మానవుడి ఆకృత్యాలకు బలైపోతున్నాయి. తాజాగా తమ ప్రాంతంలోకి మనిషి చొరబడితే ఏం జరుగుతుందో ఓ ఏనుగు (Elephant Video) రుచి చూపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

మనలో చాలా మంది ప్రకృతి ప్రేమికులు జంగిల్ సఫారీకి వెళ్తూంటారు. కొన్నిసార్లు వారికి అనుకోని భయానక సంఘటనలు ఎదురుకావచ్చు. అలాంటి అనుభవమే కొందరి టూరిస్టులకు ఎదురైంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి సుప్రియా సాహు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీకు వెన్నులో వణుకు పుట్టవచ్చు. మీరు ఓ లుక్కేయండి మరి. 

వీడియో ఓపెన్ చేస్తే.. కొంత మంది పర్యాటకులు ఓ జీప్ జంగిల్ సఫారీకి వెళ్తారు. ఇంతలో ఏ పెద్ద ఏనుగు ఘీంకరిస్తూ ఆ జీపుపైకి దూసుకొస్తుంది. డ్రైవర్ జీపును రివర్స్ లో నడుపుతున్న సరే.. కోపంతో ఆ ఉన్న ఏనుగు పరిగెత్తి మరి వారిపైకి పరిగెడుతుంది. టూరిస్టులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అవుతారు. కొద్ది క్షణాల తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో వారు ఊపిరి పీల్చుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. మిలియన్స్ వ్యూస్ తో నెట్టింట దూసుకెళ్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Viral Video: ఖాళీ రోడ్డుపై.. వీధి లైటు కింద.. ఆ జంట చేసిన పనికి నెటిజన్లు ఫిదా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More