Home> సోషల్
Advertisement

Trending Video: ఐడియా అదిరిపోయింది గురూ.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. ఈ వ్యక్తి మాములోడు కాదు..!

Zomato Boy Delivers Food On Horse: పెట్రోల్ బంక్‌ల వద్ద భారీగా క్యూ ఉంది. లైన్‌లో నిలబడితే ఎప్పుడు మనవంతు వస్తుందో లేదో తెలియదు. దీంతో ఓ ఫుడ్ డెలివరీ ఉద్యోగి వినూత్నంగా ఆలోచించాడు. తన స్నేహితుడు వద్ద ఉన్న గుర్రాన్ని తీసుకుని.. సవారీ చేస్తూ ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 
 

Trending Video: ఐడియా అదిరిపోయింది గురూ.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. ఈ వ్యక్తి మాములోడు కాదు..!

Zomato Boy Delivers Food On Horse: మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె ఎఫెక్ట్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా పెట్రోల్ బంక్‌లకు పెద్ద ఎత్తున క్యూ కట్టడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వాహనదారులు పెద్ద ఎత్తున బారులు తీరడంతో పెట్రోల్, డీజిల్ దొరకడం కష్టమైంది. అయితే ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో బంకులకు పెట్రోల్ సరఫరా అయింది. కానీ వాహనదారులు మాత్రం చాలాసేపు చాలా కష్టాలే పడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ జొమాటో డెలివరీ ఉద్యోగి వినూత్నంగా ఫుడ్ డెలివరీ చేశాడు. గుర్రంపై సవారీ చేస్తూ.. ఫుడ్ అందించేందుకు వెళ్లాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ చంచల్‌గూడ వద్ద గుర్రంపై వెళుతుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మలక్‌పేట్, నాంపల్లిలో ఫుడ్ డెలవరీ చేశాడు. 

 

 
జొమాటో డెలివరీ ఉద్యోగి సైద్ ఫారూఖ్‌ మాట్లాడుతూ.. గతంలో 10 సంవత్సరాలు డ్రైవర్‌గా పనిచేశానని.. తరువాత ఇంట్లో పరిస్థితులు సరిగా లేఖ డబ్బు కోసం డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మంగళవారం ముడు గంటల పాటు పెట్రోల్ దొరకలేదని.. చివరికి తన సన్నిహితుల వద్ద గుర్రాలు ఉంటే వాటి సహాయంతో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లానని చెప్పాడు. డెలివరీకి వెళుతున్న సమయంలో ఒక వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టానని అన్నాడు. ఫుడ్ డెలివరీ అయ్యేసరికి తాను ఫేమస్ అయ్యాయని తెలిపాడు. 

Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!

Also Read: Oneplus Buds 3 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..చీప్‌గా మార్కెట్‌లోకి OnePlus బడ్స్‌ 3..ధర, ఫీచర్స్‌ వివరాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More