Home> సోషల్
Advertisement

Dog Death Video: అచ్చు మనుషుల మాదిరే.. కుక్కకు దహన సంస్కారాలు చేసిన తోటి శునకాలు!!

Group of Dogs performed cremation rites for the Dead dog: అచ్చు మనుషల్లానే ఓ చనిపోయిన కుక్కకు తోటి శునకాలు దహనం చేశాయి. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Dog Death Video: అచ్చు మనుషుల మాదిరే.. కుక్కకు దహన సంస్కారాలు చేసిన తోటి శునకాలు!!

Group of Dogs performed cremation rites for the Dead dog: ఈ ప్రపంచంలో మనుషులు చనిపోతే వారి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. వారివారి సంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారిని కాల్చివేయడం కానీ లేదా పూడ్చడం కానీ చేస్తారు. అయితే అచ్చు మనుషల్లానే ఓ చనిపోయిన కుక్కకు తోటి శునకాలు దహనం చేశాయి. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చుసిన ప్రతిఒక్కరు చలించిపోతున్నారు. 

ఓ గుంపులోని శునకం చనిపోవడంతో తోటి కుక్కలు దహన సంస్కారాలు చేశాయి. దాదాపుగా 10 కుక్కలు తమ కాళ్లతో ముందుగా ఓ గొయ్యి తొవ్వాయి. అనంతరం చనిపోయిన కుక్కను గొయ్యిలో పడేసి.. తమ మూతితో మట్టిని దానిపై వేశాయి. గొయ్యి చుట్టూ ఉన్న కుక్కలు చాలా సమయం కస్టపడి చనిపోయిన శునకంపై మట్టిని వేశాయి. చివరికి చనిపోయిన శునకంను గొయ్యిలో పూడ్చిపెట్టాయి. 

హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఇవి జంతువులా?.. చనిపోయిన కుక్కకు పాతిపెట్టడానికి చాలా శునకాలు కష్టపడుతున్నాయి. చనిపోయిన కుక్కను ఇతర కుక్కలు పాతిపెడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తోంది. మనుషుల మాదిరే స్వంత వ్యక్తి మరణించినట్లు దహనం సంస్కారాలు చేసాయి' అని ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ పేర్కొన్నారు. 

కుక్కకు తోటి శునకాలు దహనం సంస్కారాలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రతిఒక్కక్కరికి కంట కన్నీరు తెప్పిస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను 10 వేల మందికి పైగా లైక్ చేసారు. 'మనుషుల కంటే జంతువులు చాలా సున్నితంగా ఉన్నాయి', 'కుక్కలు కూడా మనుషుల్లాగే తమ ప్రియమైన వారిపట్ల భావోద్వేగానికి లోనవుతాయి' అని కామెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Raed: Horoscope March 2 2022: ఈ రోజు మాఘ అమావాస్య.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది

Also Read: Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More