Home> సోషల్
Advertisement

Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..

Girls Drink beer in school: క్లాసులో కొంత మంది అమ్మాయిలు మద్యం బాటిళ్లను సీక్రెట్ గా తెచ్చుకున్నారు. అంతే కాకుండా.. ఏకంగా తాగుతూ వీడియోలు కూడా తీసుకున్నారు.
 

Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..

Girls dringking beer inside school in Chhattisgarh: కొంత మంది ఉపాధ్యాయులు, టీచర్ లు తరగతులకు తప్పతాగి రావడం మనం గతంలో చూశాం. మరోవైపు మరికొందరు ఉఫాధ్యాయులు తాగి వచ్చి.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా చూశాం. అయితే... ఇక్కడ కొంత మంది అమ్మాయిలు గురువులను మించిన శిష్యులుగా మారారు. కొంత మంది టీచర్ లు తరచుగా మందులు కొడుతూ వార్తలలో ఉంటున్నారు. మరీ మాకేం తక్కువ అనుకున్నారో ఏంటో కానీ.. ఏకంగా స్కూల్ లోనే తప్పతాగారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు తాజాగా, వైరల్ గా మారాయి.

 

పూర్తి వివరాలు..

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో  నిలిచింది.  బిలాస్‌పూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు బీరు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మస్తురీ ప్రాంతంలోని భట్‌చౌరా గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు క్లాసులో మందుపార్టీ చేసుకున్నారు. తోటి విద్యార్థి బర్త్ డే వేడుకలు క్లాసు లో చేసుకున్నారు.

అయితే.. వైన్ బాటిల్స్  కూడా తెచ్చుకుని క్లాసులో తాగాటం స్టార్ట్ చేశారు. ఈ ఘటనకు చెందని వీడియోలు వెలుగులోకి రావడంతో.. దీనిపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఘటనపై విచారణకు  ఆదేశించింది.

ఇదిలా ఉండగా... అందుకులో లిక్కర్ లేదని.. కేవలం గ్లాస్ లో కూల్ డ్రింగ్ ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు మిన్నంటాయి. రంగంలోకి దిగిన..  బిలాస్‌పూర్ జిల్లా విద్యా అధికారి (డీఈవో) టిఆర్ సాహు .. సంఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

Read more: Viral Video: వావ్.. మైండ్ బ్లోయింగ్.. వినాయక ఉత్సవాల్లో వెయిట్‌ లాస్‌ డ్యాన్స్‌.. కుమ్మేశారంతే.. వీడియో వైరల్..

విద్యార్థులు వీడియోలు తీస్తున్నప్పుడు సరదాగా బీర్ బాటిళ్లను ఊపారని, అయితే పానీయం తాగలేదని విచారణ బృందానికి తెలిపినట్లు సాహు తెలిపారు. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ప్రిన్సిపల్‌, ఇన్‌స్టిట్యూషన్‌ హెడ్‌పై చర్యలు తీసుకుంటామని, సంబంధిత బాలికల తల్లిదండ్రులకు నోటీసులు పంపిస్తామని అధికారి తెలిపారు. కొంతమంది అమ్మాయిలు తమ క్లాస్‌మేట్ పుట్టినరోజును జూలై 29న తరగతి గదిలో జరుపుకున్నారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతందీనిపై విచారణ కొనసాగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More