Home> సోషల్
Advertisement

Girl dancing on railway platform: రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్

Girl dancing on railway platform: లేడిపిల్లలా అమ్మాయి స్టెప్పేస్తే అటు చూడని వారంటూ ఉంటారా ? అందులోనూ పబ్లిగ్గా.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై ఆకట్టుకునేలా.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెంత బావుంటుంది.. అదుర్స్ అనిపిస్తుంది కదా.

Girl dancing on railway platform: రైల్వే స్టేషన్‌లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్

Girl dancing on railway platform: లేడిపిల్లలా అమ్మాయి స్టెప్పేస్తే అటు చూడని వారంటూ ఉంటారా ? అందులోనూ పబ్లిగ్గా.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై ఆకట్టుకునేలా.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెంత బావుంటుంది.. అదుర్స్ అనిపిస్తుంది కదా. అవును.. అందుకే ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా లైకుల వర్షంతో తమ ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. వారం, పది రోజుల కింద ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ అయిన ఈ వీడియోకు వచ్చిన లైక్సే 1.5 మిలియన్ దాటిపోయాయి. ఆ వీడియో గురించి చెప్పడం కంటే మీరే చూస్తే పోలా..

సహేలీ రుద్ర (Saheli Rudra Instagrammer) అనే ఇన్‌స్టా‌గ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ పోస్ట్ చేసిన వీడియో ఇది. బాలీవుడ్ హిట్ ట్రాక్ '' సాత్ సముందర్ పార్ మై తేరే పీచే పీచే ఆగయి'' అంటూ సాగిన రీమిక్స్ సాంగ్‌కి హుషారెత్తించే స్టెప్స్ వేసింది ఈ క్యూట్ లేడి పిల్ల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral video) అవుతోంది. 

సుమారు 19 వేల మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ కామెంట్స్ చేశారు. అలనాటి బ్యూటీఫుల్ హీరోయిన్ దివ్యభారతి, సన్నిడియోల్ (Sunny Deol) జంటగా నటించిన విశ్వాత్మ చిత్రానికి చెందిన ''సాత్ సముందర్ పార్'' సాంగ్ (Saat samundar paar song) ఈ విధంగా మరోసారి వైరల్ అయింది.

Read More