Home> సోషల్
Advertisement

Elephant Vs Jackfruit: ఆకలితో ఉన్న ఏనుగు.. చెట్టెక్కిమరీ పనస పండ్లను తెంపి తినేసింది (వీడియో)

Elephant climb Jackfruit tree. ఒక్క్కోసారి ఏనుగు చెట్టు ఎక్కి మరీ పనస పండున తెంపుతాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Elephant Vs Jackfruit: ఆకలితో ఉన్న ఏనుగు.. చెట్టెక్కిమరీ పనస పండ్లను తెంపి తినేసింది (వీడియో)

Elephant climb Jackfruit tree and plucked fruits: ఏనుగులకు పండ్లు అంటే చాలా చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అడవిలో తిరిగే ఏనుగులు తమ కంట పడిన ఏ పండును వదలవు. ఇక తమకు ఎంతో ఇష్టమైన పనస పండు (జాక్‌ఫ్రూట్‌) కనపడితే ఊరుకుంటాయా?. ఎంతో ఎత్తున ఉన్నా కూడా ఏనుగులు పనస పండును వదలవు. కష్టమైనా సరే దాన్ని తెంపకుండా ఉండలేవు. ఒక్క్కోసారి చెట్టు ఎక్కి మరీ పనస పండున తెంపుతాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఏనుగు అడవి దారి గుండా వెళుతుండగా.. దానికి ఒక పనస చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకు కొన్ని పనస పండ్లు ఉన్నా.. అవి చాలా ఎత్తులో ఉంటాయి. వాటిని తినాలనుకున్న ఏనుగు.. తెంపేందుకు చాలా కష్టపడింది. తొండంతో తెంపేందుకు ప్రయత్నించగా.. అవి అందవు. దాంతో చెట్టుపై ముందు కాళ్లు పెట్టి.. తొండం పైకెత్తి చాలా కష్టపడి పనస పండ్లను తెంపుతుంది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అరుస్తారు. పండ్లు కిందపడగానే ఎంచక్కా ఏనుగు తింటుంది. ఈ ఘటన ఇళ్ల మధ్యే జరగడంతో అక్కడున్న వారు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు.

ఏనుగు చెట్టెక్కి పనస కాయలను కోసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చెట్టుకు పైన ఉన్న పనస కాయలను కోయడానికి ఏనుగు చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) ఆఫీసర్ సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఏనుగు వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 80 వేలకు పైగా మందికి చూశారు. ఇక 4 వేలకు పైగా లైకులు వచ్చాయి. వీడియో చూసిన అందరూ ఏనుగు కష్టాన్ని ప్రశంసిస్తున్నారు. 

Also Read: Obed McCoy: నేను మా అమ్మ కోసం క్రికెట్ ఆడుతున్నా.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: మెకాయ్‌

Also Read: Chikoti Praveen: బీజేపీలోకి టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల‌? క్యాసినో చీకోటీ ప్రవీణ్ తో లింకులే కారణమా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More