Home> సోషల్
Advertisement

Eagle Vs King Cobra: గుడ్ల కోసం గద్ద- పాముల మధ్య భీకర యుద్ధం.. ఎవరిదో పై చెయ్..?

Eagle Vs Cobra Video Got Viral: ఆహారం వేటకు బయల్దేరిన పాము.. ఒక గుడ్డును మింగడం దూరంగా ఉండే కనిపెట్టిన గద్ద.. క్షణం ఆలస్యం చేయకుండా ఎగురుతూ వచ్చి పాముతో పోరాటానికి దిగడం చూస్తే ఔరా అనిపిస్తుంది. సాధారణంగానే పాము గద్ద కంటపడితే ఇక అంతే సంగతి..

Eagle Vs King Cobra: గుడ్ల కోసం గద్ద- పాముల మధ్య భీకర యుద్ధం.. ఎవరిదో పై చెయ్..?

Eagle Vs King Cobra Fighting Video Got Viral: పక్షి గుడ్లు తినడానికి వచ్చిన నాగు పాముపై గద్ద ఎలా దాడి చేసిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక జీవి తమ ఉనికికే ప్రమాదం వస్తోందని తెలిసినప్పుడు, లేదా తమ సంతానానికి ముప్పు పొంచి ఉందని తెలిసినప్పుడు అవతలి వారు ఎంత శక్తివంతులైనా.. ఆ జీవి తమ ప్రాణాలకు తెగించి ఎలా పోరాడుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను పరిశీలిస్తే.. ఆహారం వేట కోసం బయటికొచ్చిన ఓ పాము, అక్కడే అడవిలో ఉన్న పక్షి గుడ్లను తినే ప్రయత్నం చేసింది. 

ఆహారం వేటకు బయల్దేరిన పాము.. ఒక గుడ్డును మింగడం దూరంగా ఉండే కనిపెట్టిన గద్ద.. క్షణం ఆలస్యం చేయకుండా ఎగురుతూ వచ్చి పాముతో పోరాటానికి దిగడం చూస్తే ఔరా అనిపిస్తుంది. సాధారణంగానే పాము గద్ద కంటపడితే ఇక అంతే సంగతి. ఆకాశంలో అంత ఎత్తులో విహరిస్తూ కూడా నేలపై సంచరించే జీవులను కనిపెట్టగలిగేంత చూపు గద్దలకు ఉంటుందని చెబుతుంటారు. అందుకే గద్దలు ఆకాశంలో ఎగురుతూనే అదే సమయంలో నేలపై ఆహారం వెతుక్కుంటుంటాయంట. 

ఆకాశంలో విహరిస్తూనే నేలపై పాములు లాంటివి ఏవైనా కనిపిస్తే చటుక్కున వచ్చి నోట కరుచుకునిపోతుంటాయి. అలాంటిది ఈ దృశ్యంలో గద్దకు, పాముకు మధ్య శత్రుత్వమే ఉంది. అలాంటప్పుడు గద్ద ఊరుకుంటుందా చెప్పండి. ఎగిరెగిరి కాటు వేయబోతున్న పామును అంతే చాకచక్యంతో వేగంగా ఎగిరి తన కాళ్ల కింద అదిమిపడుతోంది. చివరకు గద్దదే పైచేయి అయింది. గద్దకు, పాముకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించిన పలు దృశ్యాలను ఒక సింగిల్ వీడియోగా చేసి magic wildlife అనే యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేశారు. ఆ విజువల్స్ చూస్తే.. గద్దకు, పాముకు మధ్య భీకరమైన యుద్ధమే జరిగినట్టు అర్థమవుతోంది.

Also Read: Namrata Shirodkar Workout : నమ్రత వర్కౌట్లు.. దేవీ శ్రీ ప్రసాద్ ఇలా.. అడవి శేష్ అలా

Also Read: Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More