Home> సోషల్
Advertisement

Donkey Gift Viral Video: మండపంలో భార్యకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. షాక్ తిన్న బంధువులు!

Viral Video, Pakistani husband gifted baby donkey to his wife. తాజాగా ఓ వధువుకి వరుడు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం, ఇతర వస్తువులు కాకుండా.. గాడిదను గిప్ట్‌గా ఇచ్చాడు. 
 

Donkey Gift Viral Video: మండపంలో భార్యకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. షాక్ తిన్న బంధువులు!

Pakistani husband Azlan Shah gifts a baby donkey to his wife Varisha Javed Khan: ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుక అత్యంత ముఖ్యమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ ఘట్టాన్ని  ప్రత్యేకంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. అందుకే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అదే సమయంలో పెళ్లిలో వధువు, వరుడు తమ భాగస్వామికి బహుమతులు ఇచ్చేందుకు కూడా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ వధువుకి వరుడు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం, ఇతర వస్తువులు కాకుండా.. గాడిదను గిప్ట్‌గా ఇచ్చాడు. 

విషయంలోకి వెళితే... పాకిస్థాన్‌కు చెందిన అజ్లాన్ షా అనే వ్యక్తి ప్రముఖ యూట్యూబర్. అతనికి వరిషా జావేద్ ఖాన్ అనే యూట్యూబర్‌తో  వివాహమైంది. రిసెప్షన్ పార్టీలో అజ్లాన్ తన భార్యకు గాడిద పిల్లను బహుమతిగా ఇచ్చాడు. వరిషాకు జంతువులు అంటే చాలా ఇష్టం అని, అందుకే గాడిదను బహుమతిగా ఇచ్చానని అజ్లాన్ తెలిపాడు. అజ్లాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వరిషా, గాడిదతో దిగిన చిత్రాలతో పాటు వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం క్షణాల్లో వైరల్ అయింది. పెళ్లి కంటే ఈ బహుమతి విషయమే చర్చనీయాంశంగా మార్చింది.

వరిషాకు గాడిదలు అంటే చాలా ఇష్టమని, గాడిదలు ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే మరియు ప్రేమించదగిన జంతువులని  అజ్లాన్ షా చెప్పాడు. 'వరిషా జంతువులను ప్రేమిస్తుంది. నాక్కుడా జంతువులు అంటే ఇష్టమే. వరిషాకు పెళ్లి సందర్భంగా ఏదైనా ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేశాను. గాడిద పిల్లను బహుమతిగా ఇచ్చాను. గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయడం ఇష్టం లేక.. రెండింటినీ కలిపి రూ. 30 వేలకు కొనుగోలు చేశాను. ప్రపంచంలో గాడిదకు మించిన ఆదర్శమైన జంతువు లేదు. కఠిన శ్రమకు మారుపేరు గాడిదలు. అందుకే న భార్యకు గిఫ్ట్ ఇచ్చాను' అని అజ్లాన్ చెప్పాడు. 

Also Read: Pooja Hegde Pics: బ్లూ లెహంగాలో పూజా హెగ్డే.. బుట్టబొమ్మను ఇలా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Also Read: Janhvi Kapoor Bikini Pics: బీచ్ ఒడ్డున జాన్వీ కపూర్ కిర్రాక్ పోజులు.. వణికించే చలిలో హీటు పుట్టిస్తుందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Read More